16-03-2025 12:00:00 AM
అన్ని ఉద్యోగాల్లో మాదిగలకు న్యాయం చేయాలి
ముఖ్యమంతి రేవంత్‌రెడ్డిని కోరిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్ మాదిగ
ముషీరాబాద్, మార్చి 15: (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనా భా కలిగిన మాదిగలకు అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండకుండా ఎస్సీ వర్గీకరణ లేకుం డా ఉద్యోగాలు భర్తీ చేయడం అత్యంత దారుణమని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ మాదిగ అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ డివిజన్. బాగ్ లింగంపల్లిలోని అంబేద్కర్ విగ్రహం ముం దు నుండి సుందరయ్య పార్క్ వరకు ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి ముషీరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి గజ్జల రాజశేఖర్ మాదిగ ఆధ్వర్యంలో శనివారం ఎమ్మార్పీఎస్ నిరసన ప్రదర్శనను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఆగస్టు 1 న ఇచ్చిన తీర్పును స్వాగతించిన ముఖ్యమంత్రి ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్ కు ఎస్సీ వర్గీకరణను వర్తింప చేస్తామని అసెంబ్లీలో హామీ ఇవ్వడం జరిగిందని, ఆ హామీని అమల్లోకి తీసుకురా కుండా టీచర్ ఉద్యోగాలను భర్తీ చేసి మాదిగలకు అన్యాయం చేశారన్నారు.
ఇప్పుడు ఒకవైపు 17వ తేదీన అసెంబ్లీలో చట్టం చేస్తామని చెబుతూనే మరోవైపు వర్గీకరణ అమ లు చేయకుండా ఉద్యోగ పరీక్షల ఫలితాలు విడుదల చేస్తూ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నాడని ఆరోపించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలకు చేతలకు పొంతన ఉండడం లేదని అన్నారు. ఎస్సీ రిజర్వుడు ఉద్యోగాలన్నీ మాల సామాజిక వర్గానికి దోచిపెట్టడా నికే రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడని అన్నారు. ఇప్పటికే ఉద్యోగాల్లో తీవ్రంగా నష్టపోయిన మాదిగలకు మరొకసారి గ్రూప్ -1 గ్రూప్ -2 గ్రూప్ 3 ఉద్యోగా ల్లో అన్యాయం చేయాలని చూడడం అనేది దుర్మార్గమైన చర్య అని అన్నారు.
వెంటనే రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట కట్టుబడి అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని ఆమోదిం చాలని డిమాండ్ చేశారు. ఆ చట్టాన్ని వెంటనే అమలులో తీసుకురావాలని, వర్గీకరణ ప్రకారమే ఉద్యోగ అవకాశా లన్నీ భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణను అమల్లోకి తీసుకువచ్చేంత వర కు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశా రు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ హైదారాబాద్ జిల్లా ఇన్చార్జి బొర్రా బిక్షపతి మాదిగ, ఎంఎస్పి హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు. టీవీ నరసింహ మాదిగ, ఎంఎస్పి హైదరాబాద్ జిల్లా అధికార ప్రతినిధి డప్పు మల్లి కార్జున్ మాదిగ, సీనియర్ నాయకులు గం కృష్ణ మాదిగ, చిలక ఎల్లయ్య మాదిగ, రాంనగర్ కార్పొరేటర్ రవి చారి నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు.