calender_icon.png 19 April, 2025 | 8:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వయంకృషితో ఎదగాలి ఆదర్శంగా నిలవాలి

16-04-2025 08:14:15 PM

జగదేవపూర్ (విజయక్రాంతి): చదువుకున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వాలు ఉద్యోగ అవకాశాలు కల్పించలేవని చదువుకున్న యువత స్వయం ఉపాధితో ఎదిగి ఇతరులకు ఆదర్శంగా ఉండాలని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పనుగట్ల శ్రీనివాస్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు బుద్ధ నాగరాజు, ఎంపిటిసి కవిత శ్రీనివాస్ రెడ్డి, జగదేవపూర్ మాజీసర్పంచ్ కొత్త లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, కొంపల్లి కరుణాకర్, పీర్లపల్లి మాజీ సర్పంచ్ యాదవ రెడ్డి అన్నారు.

బుధవారం నాడు మండల కేంద్రంలో గ్రామానికి చెందిన తుర్కపల్లి అరుణ్ చాయ్ బంక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొని ఛాయ్ బంక్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సయ్యద్ మునీర్, రాగుల రాజు, కొంపల్లి శ్రీనివాస్, దాచారం కనకయ్య, మాజీ కో ఆప్షన్  ఎక్బాల్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, కొత్త నర్సింహా రెడ్డి, అమర రాము, దయాకర్ రెడ్డి, బింగి  మల్లేశం, కొంపెళ్ళి మహేష్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.