calender_icon.png 19 April, 2025 | 2:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు పోరాడాలి

14-04-2025 01:56:06 AM

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి

హనుమకొండ, ఏప్రిల్ 13 (విజయ క్రాంతి): రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి.  రాజ్యాంగ పరిరక్షణకే జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమం అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.

ఈ రోజు హన్మకొండ 30వ, 31వ శాయంపేట,  కాంగ్రెస్ పార్టీ బాలసముద్రం రిలయన్స్ మార్ట్  వద్ద నుండి జై బాపు, జై భీమ్, జై సంవిదాన్  అభియాన్ పాదయాత్ర  నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలతో కలిసి రాజ్యాంగం పై బీజేపీ చేస్తున్న కుట్ర ను ప్రజలకు వివరించి చెప్పడం జరిగింది.భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యంగ విలువల పై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.

పేద, బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరటం లేదని, ప్రధానికి పేద ప్రజల కంటే బడా బాబులు ముఖ్యం అన్నారు. పార్లమెంట్ సాక్షిగా బీజేపీ రాజ్యాంగాన్ని అనగదొక్కాలని చూస్తుందని, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉందని గుర్తు చేశారు. రాజ్యాంగ రక్షణకు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలన్నారు. కులాలు, మతల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ బిజెపి రాజకీయ  పబ్బం గడుపుతుందని విమర్శించారు.

మోడీ మూర్ఖత్వపు పాలులను ప్రజలకు గమనిస్తున్నారని రానున్న రోజుల్లో బీజేపీకి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. గుజరాత్ లో ఉన్న 60 శాతం మందికి బిజెపిని ఓడించాలని ఉద్దేశంతోనే ఉందని తెలియజేశారు. దేశ ప్రజలకు ప్రేమ పంచాలనే సదుద్దేశంతో రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారని వెల్లడించారు. ఈ పోరాటం మనకోసమే కాదు మన భవిష్యత్తు తరాల కోసమని స్పష్టం చేసారు. కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ గాంధీ సైనికులగా పనిచేసే  రానున్న ఎన్నికల్లో ప్రధానమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు.

జై బాపు జై భీమ్ జై సమ్మిదాన్ కార్యక్రమం గ్రామంలోని ప్రతి ఇంటికి చేరే విధంగా కృషి చేయాలని నాయిని రాజేందర్ రెడ్డి  పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  డివిజన్ అధ్యక్షులు వల్లపు రమేష్, అంకేశ్వరపు సురేందర్, కార్పొరేటర్ మామిండ్ల రాజు, మాజీ కార్పొరేటర్లు మాడిశెట్టి శివశంకర్, వేల్పుల మోహన్ రావు, కేశిరెడ్డి మాధవి రెడ్డి, సీనియర్ నాయకులు కోన శ్రీకర్, బొంత సారంగం, కాంటె స్టేడ్ కార్పొరేటర్ బొంత సుజాత, వల్లపు రాజు, నరసింగ రావు, సుధాకర్, లడ్డు రమేష్, పెద్ద రాజు. చిన్న రాజు, వల్లపు రజిత, వల్లపు భరత్, మార్క శంకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బంక సంపత్, తౌటి రెడ్డి రవీందర్ రెడ్డి, కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.