calender_icon.png 14 March, 2025 | 11:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి

08-03-2025 11:09:56 PM

సిఐటియూ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు ఎస్ వీరయ్య..

ముషీరాబాద్ (విజయక్రాంతి): కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను ఎదుర్కొని ప్రజలందరూ పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు ఎస్. వీరయ్య పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన్ కేంద్రంలో ప్రారంభమయ్యాయి. సమావేశాల ప్రారంభ సూచికంగా టీఎంఎస్ఆర్యు పతాకాన్ని రాష్ట్ర అధ్యక్షుడు చికోటి శ్రీధర్ ఆవిష్కరించారు. ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథి సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు ఎస్ వీరయ్య ప్రారంభ ఉపన్యాసం చేస్తూ కేంద్రల్లోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక ప్రజావ్యతిరేక విధానాలను ఎదుర్కొని ప్రజలందరూ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

కేంద్రంలోని బిజెపి సర్కార్ తెస్తున్న కొత్త లేబర్ కోడ్లను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయిస్ కు కనీస వేతనం నిర్ణయించి ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మార్చి 18న ఢిల్లీలో జరిగే సదస్సులో కార్మిక సంఘాలు కార్యాచరణను నిర్ణయిస్తారని మే మొదటి వారంలో ఈ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం మందుల ధరలు తగ్గించాలని, మందులు, వైద్య పరికరాలపై జీఎస్టీ ఎత్తి వేయాలని, ప్రభుత్వ రంగ ఫార్మా కంపెనీలను పునర్ నిర్మించాలని, ఆన్లైన్లో మందులు అమ్మకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిఐటియు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర కార్యదర్శి జే వెంకటేష్,జాతీయ కౌన్సిల్ సభ్యులు ఏ నాగేశ్వరరావు, టీఎంఎస్ఆర్యు ప్రధాన కార్యదర్శి సిహెచ్ భాను కిరణ్ ప్రసంగించారు. వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.