calender_icon.png 28 April, 2025 | 9:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగ్రవాదాన్ని అరికట్టడానికి ఏకతాటిపైకి రావాలి

28-04-2025 01:12:03 AM

చేర్యాల, ఏప్రిల్ 27: ఉగ్రవాదాన్ని అరికట్టడానికి భారతీయులందరూ ఏకతాటిపై ఉండి కలిసికట్టుగా ఎదుర్కోవాలని ఆలయ ఈవో అన్నపూర్ణ అన్నారు. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానం అర్చకులు, ఉద్యోగులు రాజగోపురం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఉగ్రవాదుల్ని పిరికిపంద చర్యని విమర్శించారు.

ఉగ్రవాదాన్ని సమూలంగా పెక్కిలి వేయడానికి ప్రజలంతా కలిసికట్టుగా పోరాడాలన్నారు. నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని ప్రభుత్వానికి సూచించారు. కట్టుదిట్టమైన భద్రత ను ఏర్పాటు చేయాలని తెలిపారు. సనాతన హిందు ధర్మానికి హిందువులందరూ రక్షణ కవచంగా ఉండాలన్నారు.

ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్ , ఒగ్గు పూజారుల సంఘం అధ్యక్షులు బొద్దుల కనకయ్య, అత్తిని పరుశురాములు ఒగ్గు పూజారులు అర్చకులు పాల్గొన్నారు.