18-04-2025 12:00:00 AM
ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఉట్నూర్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడే తత్వాన్ని అలవర్చుకొని అన్ని రంగాల్లో రాణించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ సూచించారు. గురువారం ఉట్నూర్ మండల కేం ద్రంలో నిర్వహించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల కల్చరల్, స్పోరట్స్ డే కార్యక్రమంలో ఎమ్మె ల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఈమేర కు ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మాట్లాడుతూ... విద్యార్థులు పట్టుదలతో చదివి అనుకున్న లక్ష్యాల వైపు నడవాలని పేర్కొన్నారు. పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఈడీ కళాశాలలో ప్రిన్సిపాల్ మనోహర్, డిగ్రీ కళాశా ల ప్రిన్సిపాల్ ప్రతాప్ సింగ్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సాయి ప్రసాద్, అధ్యాపకులు డాక్టర్ రాణి, డాక్టర్ అనిత, షేక్ ముజీబ్, స్వామి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.