calender_icon.png 21 January, 2025 | 12:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్ని హంగులతో సినిమా నిర్మించాం.. ఆశీర్వదించండి

20-01-2025 08:26:02 PM

నిజామాబాద్ జిల్లాకు చెందిన యువ నటుడు శీలం విరాజ్ రెడ్డి

నిజామాబాద్ (విజయక్రాంతి): తాను నటించిన  సినిమా అన్ని హంగులతో రూపొందించామని జిల్లా ప్రజలు ఆశీర్వదించాలని నిజామాబాద్ జిల్లాకు చెందిన యువ నటుడు శీలం విరాజ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సోమవారం నిజామాబాద్ లోని మోపాల్ మండలం నర్సింగ్ పల్లి గ్రామ శివారులోని ఎస్.ఆర్.ఎస్ గార్డెన్ లో యువ సినీ నటుడు విరాజ్ రెడ్డి శీలం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిజామాబాద్ జిల్లాలోని కంజర గ్రామంలో పుట్టి పెరిగానని మొట్టమొదటి సారిగా గార్డ్ సినిమాలో హీరోగా నటించడం ఆనందంగా ఉందన్నారు. ఇందుకుగాను గార్డ్ సినిమా టీజర్ రిలీజ్ ఫంక్షన్ ను ఈనెల 23వ తేదీన నర్సింగ్ పల్లి గ్రామ పరిధిలోని ఎస్.అర్.ఎస్ గార్డెన్స్ లో సాయంత్రం 7:30 నిమిషాలకు ఈ సినిమా సందడి ఏర్పాట్లను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అన్ని హంగులతో ప్రేక్షకుల మదుల్లో నిలిచిపోయేలా ఈ సినిమాను తీయడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని సినీ ప్రేక్షకులందరూ తనను ఆశీర్వదించేందుకు వచ్చి ఈ సినిమా సందడిలో పాల్గొనాలని నిజామాబాద్ ప్రజలను ఆయన ఆహ్వానిస్తూ విజ్ఞప్తి చేశారు.