calender_icon.png 9 January, 2025 | 5:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగును పండుగ చేసినం

12-12-2024 12:00:00 AM

  1. రికార్డుస్థాయిలో దిగుబడి పెంచాం
  2. ఎక్స్ వేదికగా బీఆర్‌ఎస్ కేటీఆర్ 

హైదరాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): తెలంగాణలో వ్యవసా యాన్ని పండుగలా చేశామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తమ హయాంలో సాగుతోపాటు దిగుబడి కూడా భారీగా పెరి గిందని చెప్పారు. తొమ్మిదిన్నరేళ్ల సాగులో తెలంగాణలో అద్భుతాలు సాధించామన్నారు.

2013-14 నుంచి 2022-23 మధ్య కాలంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించిన ఘ నతలకు తాజాగా ఆర్‌బీఐ విడుదల చేసిన గణాంకాలే నిదర్శనమన్నారు. తాము అధికారంలోకి వచ్చాక సాగు విస్తీర్ణం భారీగా పెరిగిందని.. రెండు పంటలకు ఆటంకం లేకుండా నీరు, నిరంతరం కరెంట్ ఇచ్చామన్నారు. 

రాష్ట్రంలో 2013-14లో రెండు పంటలకు సంబంధించి 78.18లక్షల ఎకరాలకు నీరందిస్తే.. 2022-23 నాటికి అది కోటీ 60లక్షల ఎకరాలకు చేరిందన్నారు. ఆహార పంటల ఉత్పత్తి కూడా బీఆర్‌ఎస్ హయాం లో రికార్డుస్థాయిలో పెరిగిందని చెప్పారు. 2013-14లో 2.25కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తే..

2022-23 నాటికి 5కోట్ల టన్నులకు చేరిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో సాగులో కూడా తెలంగాణ ప్రగతి సాధించిందన్నారు. 2013-14లో 1.55కోట్ల ఎకరాల్లో సాగు చేస్తే.. 2022-23 నాటికి  2.29కోట్ల ఎకరాలకు చేరినట్టు ఆర్‌బీఐ గణాంకాల ను ఉటంకిస్తూ కేటీఆర్ చెప్పారు.