- నియోజకవర్గంలో ఏడాదిలో రూ.120 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం
పట్టణంలో రూ.2 కోట్ల పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే ెున్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ జనవరి 4 (విజయ క్రాంతి) : పది సంవత్సరాలు టిఆర్‌ఎస్ పార్టీకి అధికారం ఇచ్చి ఎంతో విలువైన కాలాన్ని నష్టపోయామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ెున్నం శ్రీనివాసరెడ్డి అసహ నం వ్యక్తం చేశారు. శనివారం పట్టణంలో రూ 2 కోట్లతో 12,13,20,41,38 వార్డుల లో సిసి రోడ్లు, మహిళా సమైక్య భవనాల తో పాటు అభివృద్ధి పనులకు శంకుస్థాపన లు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏదో హంగు హార్భావం చేయాలి, ప్రజాధనాన్ని వృధా చేయాలి అనే ఆలోచన తమకు లేదని, ప్రభుత్వ సొమ్ము అంటే మన అందరిదీ అనే భావన ప్రతి ఒక్కరిలో ఉండాలని సూచించారు. ప్రతి రూపాయిని ఎలా ఖర్చు పెట్టాలో ఆలోచిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతుందని వివరించారు.
ఏడాది కాలంలోనే నియోజకవర్గంలో రూ 120 కోట్ల వివిధ అభివృద్ధి పనులకు కేటాయించుకోవడం జరిగిందని తెలియ జేశారు. ఎలాంటి సమస్యలున్న తమ దృష్టికి తీసుకురావాలని ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు సాగుదా మని సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, కౌన్సిలర్ లక్ష్మి దేవి యాదగిరి గౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, వెన్నారపు లింగం యాదవ్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది, నాయకులు అజ్మత్ అలి, శామ్యూల్, ఫయాజ్ ఉన్నారు.
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేత..
మహబూబ్‌నగర్, జనవరి 4 (విజయ క్రాంతి) : మీ సంతోషమే మా కర్తవ్యమని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. శనివారం భూత్పూర్ మండల తాసిల్దార్ కార్యాలయం దగ్గర మండల సమై మహిళా సమైక్య భవనంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారు ల కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజ ల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభు త్వం ప్రతిక్షణం పాటుపడి పనిచేస్తుందని తెలిపా రు. ప్రభుత్వం పరిస్థితి చేస్తున్న పనిని చెబుతూ ముందుకు సాగుతుందని పేర్కొ న్నారు. భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలు అందుబాటులోకి వస్తాయని, ప్రతి ఒక్కరికి భరోసా ఉండేలా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు ఉన్నారు.