మాది ఈలేగాం గ్రామం. మాకు సిరాల ప్రాజెక్టు నిండితేనే సాగునీటికి భరోసా. ప్రాజెక్టు కింద మాకు రెండెకరాల పొలం ఉంది. గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్ట్ కట్టకు గండి పడింది. దీంతో సాగులో ఉన్న వరి పొలం కొట్టుకపోయింది. సాగుకు పెట్టిన పెట్టుబడి కూడా చేతికి రాలేదు. కోతకు గురైన పొలాన్ని బాగు చేయడానికి చాలా డబ్బు ఖర్చయింది. గండి పూడిస్తే ఈసారైనా పంటలు పండుతాయనుకున్నాం. కానీ ప్రభుత్వం గండి పూడ్చలేదు. ఏ అధికారీ మా సమస్యను పట్టించుకోవడం లేదు.
అల్లకొండ బక్కన్న,
ఆయకట్టు రైతు, సిరాల