calender_icon.png 3 October, 2024 | 3:56 AM

మీ సమస్యలు తెలుసు.. అన్నింటిని పరిష్కరిస్తాం

03-10-2024 01:57:36 AM

  1. 317 జీవో బాధితులకు పీసీసీ చీఫ్, మంత్రి పొన్నం హామీ 
  2. గాంధీభవన్ ఎదుట 317 జీవో బాధితుల ఆందోళన 
  3. అడ్డుకున్న పోలీసులు.. కొద్దిసేపు ఉద్రిక్తత 
  4. గాంధీభవన్‌లోకి ఆహ్వానించి చర్చించిన పీసీసీ చీఫ్ 

హైదరాబాద్, అక్టోబర్ 2 (విజయక్రాంతి): ‘మీ సమస్యలన్ని మాకు తెలుసు. ఒకదాని తర్వాత ఒకటి పరిష్కరిస్తాం. కొత్త టీచర్ ఉద్యోగాలతో మీకు ఎలాంటి సంబం ధం ఉండదు. కేసీఆర్‌లా మేం మాటలు చెప్పం. మేం ఇచ్చిన మాట తప్పం ’ అని 317 జీవో బాధితులకు పీసీసీ అధ్యక్షుడు మ హేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.

తమ సమస్యలను పరిష్కరించాలని  317 జీవో బాధితులు బుధవా రం గాంధీభవన్ ఎదుట ఆందోళన నిర్వహించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గాం ధీభవన్ ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పీసీసీ చీఫ్, మంత్రి పొన్నం ప్రభాకర్ వారిని గాంధీభవన్‌లోకి ఆహ్వానించి, చర్చలు జరిపారు.

ఒక డెడ్‌లైన్ పెట్టి తమ సమస్యలను పరిష్కరించాలని కోరగా, డెడ్‌లైన్ ద్వారా సమస్యలు పరిష్కారం కావని, 317 జీవోకు సంబంధించి సమస్యలను పరిష్కరించేందుకు మం త్రి దామోదర రాజనర్సింహా అధ్యక్షతన సబ్‌కమిటీ వేశారని, ఆయనను కలిసి సమస్యలు చెప్పాలని సూచించారు.

ఈ సందర్భంగా మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. శాంతియుతంగా నిరసనలు చేస్తున్నారని, తాము వద్దనడం లేదని అన్నారు. ప్రతిపక్షం ఉండాలని తమ ప్రభుత్వం కోరుకుంటుందని చె ప్పారు. గత బీఆర్‌ఎస్ హయాంలో నిరసన లే కాకుండా కనీసం సమస్యలు చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉండేది కాదన్నారు. 

జీవో తెచ్చిన వాళ్లే విమర్శిస్తున్నారు : మంత్రి పొన్నం 

317 జీవో తీసుకొచ్చిన వాళ్లే.. ఇప్పుడు  విమర్శలు చేస్తున్నారని మంత్రి పొన్నం బీఆర్‌ఎస్ నాయకులపై మండిపడ్డారు. క్యాబినెట్ సబ్‌కమిటీ సభ్యుడిగా చెప్తున్నానని, 317 జీవో బాధితులకు అన్యాయం చేయమని భరోసానిచ్చారు. పలు కారణాల వల్ల సమస్య పరిష్కా రం వాయిదా పడిందని, 317 జీవోపై వేసిన మంత్రివర్గ ఉపసంఘం అనేక అంశాలపై అ ధ్యయనం చేసిందన్నారు. కమిటీ సభ్యులు, మంత్రి శ్రీధర్‌బాబు అమెరికాకు వెళ్లడం, అసెంబ్లీ సమావేశాలు రావడంతో కమిటీ సమావేశం జరగలేదని మంత్రి వివరించారు.