మోదీతో గణపతి పూజ వివాదంపై సీజేఐ క్లారిటీ
న్యూఢిల్లీ, అక్టోబర్ 28: ప్రజాస్వామ్య దేశంలో ప్రధాని, రాష్ట్రాల ముఖ్యమంత్రులతో న్యాయమూర్తులు తరచూ సమావేశాలు జరుపు తారని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. న్యాయమూర్తులు, ప్రజాప్రనిధుల మధ్య ఇటువంటి సమావేశాలు జరగడం సర్వసాధారణంగానే చూడాలన్నారు. వీటికి ప్రత్యేకతను ఆపాదించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ముంబైలో ఓ కార్యక్రమంలో ఆదివారం సీజేఐ పాల్గొని మాట్లాడుతూ.. గత నెలలో తన నివాసంలో నిర్వహించిన గణపతి పూజకు ప్రధాని మోదీ హాజరైన విషయాన్ని ప్రస్తావించారు. రాజకీయ ఆరోపణలను కూడా సీజేఐ గుర్తు చేశారు. ప్రభుత్వాలతో న్యాయవ్యవస్థలకు పాలనాపరమైన సంబం ధాలు ఉంటాయని చెప్పారు. వాటిపై మాట్లాడటానికే ప్రభుత్వ పెద్దలతో న్యాయమూర్తులు సమావేశాలు కావాల్సి ఉంటుందన్నారు.