calender_icon.png 5 April, 2025 | 6:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాట నిలబెట్టుకున్నాం

05-04-2025 02:22:34 AM

  1. నిరుద్యోగ యువత ఆశలను నిజం చేశాం: డిప్యూటీ సీఎం భట్టి
  2. 112 మంది యాదాద్రి థర్మల్ ప్రాజెక్ట్ భూనిర్వాసితులకు, 51 మంది డీఏవోలకు నియామక పత్రాల అందజేత

హైదరాబాద్, ఏప్రిల్ 4 (విజయ క్రాంతి): ప్రజాప్రభుత్వం అధికారం లోకి రాగానే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతులు తీసుకొచ్చి, పనులు మొదలు పెట్టిం దని.. నిర్వాసితులకు థర్మల్ ప్రాజెక్ట్‌లో ఉద్యోగాలిస్తామని మాటను నిలబెట్టు కున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క తెలిపారు.

పవర్ ప్లాంట్ నిర్వా సితులకు ఉద్యోగాలు ఇస్తామన్న హామీ గత పాలకులు నెరవేర్చకపోవడంతో.. వారి వయసు కూడా దాటిపోయింద న్నారు. నల్లగొండ జిల్లా దామరచర్ల లోని థర్మల్‌పవర్ విద్యుత్ ప్రాజెక్టు లోని భూ నిర్వాసితుల కుటుంబాలకు శుక్రవారం హైదరాబాద్‌లోని సైబర్ గార్డెన్‌లో డిప్యూటీ సీఎం భట్టి ఉద్యోగ నియా మక పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులు పూర్తి చేయడానికి అధికారులకు కాలెండర్‌ను నిర్దేశించడంతో పాటు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించి సీ ఎం రేవంత్‌రెడ్డితో ప్లాంట్‌ను ప్రారంభించామన్నారు. సీఎం, తాను సమష్టిగా ఆలో చించి భూములు, ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

గతంలో ఇచ్చిన మాట ప్రకారం అర్హత ఉన్న 112 మందికి యాదాద్రి పవర్ ప్లాంట్‌లో ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తున్నట్టు చెప్పారు. వీరితో పాటు ఆర్థిక శాఖలో 51 మందికి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్‌కి నియామక అందజేస్తున్నామని తెలిపారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 59,000 మందికి ఉద్యోగాలు కల్పించినట్టు వెల్లడించారు.

ఉద్యోగ అవకాశాలు పొందలేని నిరుద్యోగ యువత కోసం రూ.6 వేల కోట్లతో స్వయం ఉపాధి పథకాలు అందించడానికి రాజీవ్ యువవికాస పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. గత ప్రభుత్వం మాదిరి ప్రకటన చేసి వదిలేయకుండా అర్హుల నుంచి దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించామని చెప్పారు. యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించడానికి హైదరాబాద్ నగరంలో ఐటీ సెక్టర్, నాలెడ్జ్ వ్యవస్థలను ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.

కొండలు, గుట్టలు, ఖాళీ ప్రదేశాలుగా ఉన్న హైటెక్ సిటీ ప్రాంతంలో ఐటీ సెక్టార్ నెలకొల్పడానికి ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి వేసిన పునాదులు వేయగా.. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా ఐటీ సెక్టార్‌ను అభివృద్ధి చేయడంతో ఈరోజు హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారిందన్నారు.

హైదరాబాద్ నగరాన్ని విస్తరించి ప్రపంచంలో పేరు ప్రఖ్యాతి పొందిన సంస్థలను తీసుకురావడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్‌కు వెళ్లి రూ.లక్షా 84 వేల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూ కుదుర్చుకున్నారని చెప్పారు. హైదరాబాద్ నగరాన్ని విస్తరించడంలో భాగంగానే ఫ్యూచర్ సిటీ నిర్మాణం, అందులో స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

ఔటర్ రింగ్ రోడ్-, రీజినల్ రింగ్ రోడ్ మధ్య చేయాల్సిన అభివృద్ధి విషయంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని, అయితే ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రగతి నిరోధకులు చేస్తున్న కుట్రల పట్ల అప్రమత్తంగా ఉంటూ నిరుద్యోగ యువతీ యువకులు అభివృద్ధి వైపు ముందుకు వెళ్లాలని భట్టి సూచించారు.