calender_icon.png 6 March, 2025 | 3:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్లు పెరుగుతాయని ఆశిస్తున్నాం

06-03-2025 12:15:10 AM

బీసీ కమిషన్ చైర్మన్ జీ నిరంజన్

హైదరాబాద్, మార్చి 5 (విజయక్రాంతి): కులగణనలో తేలిన కులాల లెక్కల ఆధారంగా బీసీలు ఆశించిన రీతిలో రిజర్వేషన్ల పెంపు జరుగుతుందని తాము ఆశిస్తున్నట్టు బీసీ కమిషన్ చైర్మన్ జీ నిరంజన్ పేర్కొన్నారు. బుధవారం ఖైరతాబాద్‌లోని బీసీ కమిషన్ ఆఫీస్‌లో సభ్యుల సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా  నిరంజన్ మాట్లా డుతూ.. బీసీ కమిషన్ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ ఎన్యుమరేటర్లను పంపి, 50 రోజుల పాటు కులగణన సర్వే నిర్వహించిందన్నారు. అలాగే, ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు రెండోసారి కూడా ప్రభు త్వం సర్వేకు అవకాశం కల్పించడాన్ని నిరంజన్ స్వాగతించారు.

కులగణనపై బీసీ కమి షన్ తన వంతు కర్తవ్యంగా 10 ఉమ్మడి జిల్లాలు, జంట నగరాల్లో ప్రజలకు అవగాహన కల్పించడానికి పర్యటించిందన్నారు. స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ విభాగం, కాళోజీ హెల్త్ వర్సిటీ నుంచి కులాలవారీగా విద్యార్థుల వివరాలు సేకరిస్తున్నట్టు చెప్పారు. సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి రంగు, మెంబర్ సెక్రటరీ బాల మాయాదేవి పాల్గొన్నారు.