calender_icon.png 1 March, 2025 | 2:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.3 కోట్ల 67 లక్షల పనులకు ఆడిట్ చేపట్టాం..

28-01-2025 06:34:51 PM

డిఆర్డిఏ పిడి కిషన్...

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలో ఈజిఎస్ పథకంలో భాగంగా మంగళవారం సామాజిక తనిఖీ ప్రజావేదికలో రూ.3 కోట్ల 67 లక్షల పనులకు సంబంధించి ఆడిట్ చేపట్టినట్లు డిఆర్డిఏ పిడి జి.కిషన్ చెప్పారు. బెల్లంపల్లి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఈజిఎస్ సామాజిక తనిఖీ ప్రజావేదిక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈజీఎస్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో అభివృద్ధి పనుల్లో ముందుకు సాగాలన్నారు. సిటిజన్ చార్ట్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని సూచించారు. సెలవు దినమైన ఆదివారాలు కూలీలకు డబ్బులు చెల్లించొద్దు అన్నారు. ఎప్పటికప్పుడు పనులకు సంబంధించి ఈజీఎస్ అధికారులు, సిబ్బంది రూల్ కాల్ చేయాలని కోరారు. పనులు చేపట్టే విషయంలో ఫారెస్ట్ అనుమతులు తప్పనిసరి తీసుకోవాలని కోరారు. రాబోయే 16వ విడత ప్రజా వేదికలు ఎలాంటి పొరపాట్లు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

బెల్లంపల్లి మండలానికి కొత్తగా రూ.20 కోట్ల ఎం.సీ.సీ వర్క్స్ కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ నిధులను టార్గెట్ గా పెట్టుకొని నూతన పాఠశాల భవనాలు, ప్రహరీ గోడల నిర్మాణాలు, ఫార్మేషన్ రోడ్లు, నర్సరీలు చేపట్టాలని ఈజీఎస్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. ఈ పనులకు సంబంధించి ఎంబీ లను ఫిబ్రవరి 10 లోగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఈజీఎస్ తనిఖీ ప్రజావేదికలో 11 గ్రామపంచాయతీల్లో జరిగిన అవకతవకలపై రూ.14,237 వేల జరిమానా విధించగా, రూ.1237 రికవరీ చేసినట్లు చెప్పారు. మిగతా రూ.13000 జరిమానాను త్వరలోనే ఈజీఎస్ సిబ్బంది నుండి రికవరీ చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ ఆఫీసర్ కిరణ్, ఈజిఎస్ అంబుడ్స్ మెన్ కె. శివరాం, స్టేట్ టీం మేనేజర్ ఇ. వేణు, ఎస్ ఆర్ పి ఎం. దేవేందర్, ఎంపీడీవో మహేందర్, ఈజీఎస్ ఏపీవో ఎస్తర్ డేవిడ్, టెక్నికల్ ఆఫీసర్ అనిల్, డిఆర్పీలు కిషోర్, జితేందర్, అభిమాన్, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్లు, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.