విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’. కొత్త దర్శకుడు రవితేజ ముళ్లపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీని ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. నవంబర్ 22న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో హీరో విశ్వక్సేన్ మంగళవారం విలేకరులతో చిత్ర విశేషాలను పంచుకున్నారు.
కథలో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశం ఏమిటి?
నాలుగైదు ఏళ్లుగా జరుగుతున్న ఒక బర్నింగ్ పాయింట్‌ను ఈ సినిమాలో టచ్ చేశాం. అది స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. అసలు ఇంతకాలం ఈ పాయింట్ ఎవరూ, ఎందుకు టచ్ చేయలేదనిపిస్తుంది. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, ఈ సినిమా.. రెండూ ఒకే సమయంలో చేశాను. ఆ సినిమా చేస్తున్నప్పుడు ఒక చిన్న భయం ఉండేది.
ఈ సినిమాలో మేము చెబుతున్న పాయింట్‌తో ఇంకేదైనా చిత్రం వస్తుందా? అని ఒక చిన్న టెన్షన్ ఉండేది. ఈ సినిమాలో మేము మెసేజ్ ఇవ్వడం లేదు. అయితే కావాల్సిన వారు అందులో నుంచి మెసేజ్‌ను తీసుకోవచ్చు. సెకండ్ హాఫ్ మొదలైన పది నిమిషాల తర్వాత హై స్టార్ట్ అయిపోతుంది.
ఫోన్ వస్తే కట్ చేసి జేబులో పెట్టుకునేంత మ్యాటర్ ఉంది. ఇది అన్ ప్రిడిక్టబుల్ మూవీ. ఊహించని విధంగా ఉంటుంది. -సునీల్, నరేశ్‌తో గుర్తుండిపోయేలా ఓ మూవీ చేయాలని ఎప్పటినుంచో ఉండేది. అది ఈ చిత్రంతో కుదిరింది. సునీల్, రఘు యాంటీ హీరో రోల్స్ చేస్తున్నారు.
‘మంచి క్వశ్చన్ కొట్టు.. గోల్డ్ కాయిన్ పట్టు’ ఐడియా ఎలా వచ్చింది?
-రెగ్యులర్‌గా కాకుండా కాస్త ప్యాట్రన్ బ్రేక్ చేయాలనిపించింది. పార్టీలోనే ప్రెస్‌మీట్ చేసుకుంటున్నాం కదా అందరం ఒక టేబుల్ దగ్గర కూర్చుని జోవియల్‌గా మాట్లాడాలనిపించింది. అలా మాట్లాడినప్పుడు మంచి క్వశ్చన్‌కి గోల్డ్ కాయిన్ ఇవ్వాలనే ఆలోచన వచ్చింది. మంచి క్వశ్చన్ ఏమిటనేది నాకూ తెలీదు (నవ్వుతూ). ఐడియా నాకు వచ్చింది. మిగిలింది మీరు ముందుకు తీసుకువెళ్లాలి (నవ్వుతూ).
కొత్త సినిమాల గురించి?
‘-లైలా’ 60 శాతం వరకు కంప్లీట్ అయ్యింది. సుధాకర్, అనుదీప్ గారి సినిమాలు ప్యార్లల్గా జరుగుతాయి. ‘కల్ట్’ మార్చిలో మొదలుపెడతాం. ‘ఏమైయింది నగరానికి 2’ రైటింగ్ జరుగుతోంది.