ఇండియన్ సినీ ఇండస్ట్రీలో కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి కీలక ప్రకటన వెలువడింది. అదే ‘దళపతి 69’. విజయ్ హీరోగా రూపొందుతున్న చివరి చిత్రమిది. మూడు దశాబ్దాల ప్రయాణంలో దళపతి విజయ్ సినీరంగంలో తిరుగులేని స్టార్‌డమ్‌తో కథానాయకుడిగా రాణించారు. ఆయన కథానాయకుడిగా రానున్న 69 చిత్రం, చివరి సినిమా చూడాలంటే మరో ఏడాది ఆగాల్సిందే. ఈ సినిమా కోసం హెచ్ వినోద్ మరో అద్భుతమైన కథతో సిద్ధంగా ఉన్నారు. దీనికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందివ్వనుండగా.. జగదీశ్ పళనిస్వామి, లోహిత్ సహ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.
ఎన్‌కే, వెకంట్ కే నారాయణ ఆధ్వర్యంలో రూపుది ద్దుకోనున్న ఈ చిత్రం దళపతి అభిమానులకు ఎంతో ప్రత్యేకం కానుంది. కేవీఎన్ ప్రొడక్షన్ సంస్థ వదిలిన వీడియోలో దళపతి అభిమా నులు ఎమోషనల్ అయిన తీరే ఇందుకు నిదర్శనం. ‘దళపతి విజయ్‌తో మా మొదటి చిత్రం.. దళపతి 69వ సినిమా ను హెచ్ వినోద్‌తో కలిసి చేస్తుండటం ఆనందంగా ఉంది. టార్చ్ బేరర్ అయిన విజయ్‌తో తీస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతా న్ని అందివ్వనున్నారు. ఈ మూవీ 2025 అక్టోబర్ నెలలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.