14-02-2025 01:52:40 AM
వనపర్తి టౌన్, ఫిబ్రవరి 13 : జిల్లా ప్రజల అవసరం మేరకు మన ఇసుక వాహనం ద్వారా ఇంటి వద్దకే ఇసుక సరఫరా చేయ డం జరుగుతుందని, ఇసుకకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే ప్రజలు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి తెలియజేయవచ్చని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి గురువారం ఒక ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు. వనపర్తి జిల్లా లో అక్రమ ఇసుక వ్యాపారం చేసేవారి పై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.
జిల్లాలో 12 ఇసుక రీ లు ఉన్నాయని, గృహ నిర్మాణాలు చేపడుతున్న జిల్లా ప్రజలకు మన ఇసుక వాహనం ద్వా రా తక్కువ ధరకే ఇసుక ఇంటి వద్దకు సరఫ రా చేస్తున్నామని తెలిపారు. ఇసుకకు సం బంధించి ఏమైనా సమస్యలు ఎదురైన ట్లయితే ఐడిఓసిలో ఏర్పాటు చేసిన కంట్రో ల్ రూమ్ 08545-233525 కు కాల్ చేసి తెలపవచ్చని చెప్పారు.
నేరుగా వచ్చి సమస్య తెలియజేయాలనుకునేవారు ఐడిఓసి లోని రూమ్ నెంబర్ 115 కి వచ్చి తమ సమస్య లను తెలియజేసి సహాయం పొందవచ్చు అని చెప్పారు. ఉదయం ఆరు గంటల నుం చి, సాయంత్రం 6 గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు.