- ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఓ రాజకీయ బ్రోకర్
- మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్
హైదరాబాద్, సెప్టెంబర్ 15(విజయక్రాంతి): కాంగ్రెస్ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాలని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ హెచ్చరించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏదైనా విషయంపై సమాధానం అడిగితే ఆ పార్టీ ఎమ్మెల్యేలు గుండాల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దమ్ముం టే ప్రతిపక్ష సభ్యులకు సామరస్యంగా సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మెప్పు పొందే ప్రయత్నం చేస్తున్నారని సెటైర్ వేశారు.
రాజేందర్ రెడ్డి ఓ రాజకీయ బ్రోకర్ అని మండిపడ్డా రు. పైరవీలతో పబ్బం గడుపుకున్న చరిత్ర ఆయనని ఆగ్రహం వ్యక్తం చేశా రు. కేటీఆర్‌ను విమర్శించే స్థాయి రాజేందర్ రెడ్డికి లేదని అన్నారు. పొన్నాల లక్ష్మయ్య దగ్గర ఎన్ని పైరవీ లు చేశావో, ఎన్ని కాంట్రాక్టులు పొం దావో సాక్ష్యాలతో బయటపెడుతా అని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నేత డాక్టర్ వాసుదేవరెడ్డి పాల్గొన్నారు.