23-04-2025 12:00:00 AM
డాక్టర్ విశారదన్ మహరాజ్
ఆదిలాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): అగ్రకుల రాజకీయ నాయకులపై రాజ్యాధికారం కోసం అణగారిన వర్గాలు ధర్మ యుద్ధం చేయాల్సిందేనని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్, ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహరా జ్ పిలుపునిచ్చారు. లక్ష కిలోమీటర్ల ‘మా భూమి’ రథయాత్రలో భాగంగా మంగళవా రం జైనథ్ మండలం కరంజి(కే) గ్రామంలో పర్యటించారు.
ఈ సందర్భంగా గ్రామంలో ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడ రోగులకు అందుతున్న వైద్యంపై ఆయన ఆరా తీశారు. పీహెచ్‌సీలోని మరుగుదొడ్లు, పరిసరాల పరిస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, స్వయంగా మరుగుదొడ్లను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి విశారదన్ మహరాజ్ మాట్లాడారు. భూమి, రాజ్యం, సంపద అంత కేవలం 10 శాతం లేని రెడ్డి, వెలమ దొరల వద్ద ఉంటే 90 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీల దగ్గర మట్టి మిగిలిందన్నారు.
పేదల కష్టసుఖాల్ని అడిగి తెలుసుకునే వారే కరువైయ్యారన్నా రు. గ్రామాల్లోని ఇండ్లను చూస్తే వానలకు పడి పోయెల ఉన్నాయని, పేదలను గుర్తించ లేని జిల్లా కలెక్టర్ దండగ అని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలను గుర్తించి ప్రభుత్వంతో పోరాడి వాటిని సాధిస్తామన్నారు. కార్యక్రమంలో ధర్మ సమాజ పార్టీ జిల్లా అధ్యక్షులు అగిమల్ల గణేష్, నాయకులు లక్ష్మణ్, పోచ్చ న్న, నగేష్, సుష్మ, శ్యామల, దివ్యవాణి, గంగ న్న, నవీన్, గ్రామస్తులు పాల్గొన్నారు.