ఎన్టీపీసీ రెండవ ఫేస్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణంపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్
రామగుండం, జనవరి-28 (విజయ క్రాంతి): ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం పై ప్రజలు అందించిన అభిప్రాయాలను స్వీకరించామని ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని నమోదు చేసి సంబంధిత శాఖకు పంపు తామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ అన్నారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ ఎన్టిపిసి జ్యోతి నగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎన్టిపిసి రెండవ ఫేస్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం పై నిర్వహించిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ లతో కలిసి పాల్గొన్నారు. అన్ని సంఘాల ప్రతినిధులకు, వివిధ వర్గాల ప్రజలకు ఎన్టిపిసి విద్యుత్ ప్లాంట్ నిర్మాణం పై అభిప్రాయాలు తెలిపే అవకాశం కల్పించారు.
సుమారు 49 మందికి పైగా తెలిపారు. ఉదయం 11 గం. నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ప్రజాభి ప్రాయ సేకరణ ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్ట ర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా ఎన్టీపీసీ ద్వారా నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ తెలంగాణ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని,
అందు లో భాగంగా 1600 మెగా వాట్ల సంబం ధించి విద్యుత్ ప్లాంట్ నిర్మాణం చేసుకొని సరఫరా చేయడం జరుగుతుందని, ప్రస్తు తం రెండవ దశలో మిగిలిన 2400 మెగా వాట్ల (800 మెగావాట్ల ఐ3 యూనిట్ల) ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణ తీసుకు న్నామని అన్నారు. ఎన్టిపిసి రెండవ ఫేస్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత దేశంలోనే అతిపెద్ద విద్యుత్ ప్లాంట్ గా మన రామగుండం ఆవిర్భవిస్తుందని అన్నారు.
ఎన్టిపిసి రెండవ ఫేస్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం వల్ల జరిగే పర్యావరణ మార్పుల పై స్టడీ చేసి నివేదిక తయారు చేసారని అన్నారు. పర్యావరణ ప్రజాభిప్రా య సేకరణలో ప్రజల నుంచి వచ్చిన సందే హాలు, సూచనలు అన్ని పరిగణలోకి తీసుకొ వడం జరుగుతుందని అన్నారు. ప్రజాభిప్రా య సేకరణ వీడియో రికార్డింగ్ జరుగు తుందని అన్నారు. ప్రజల అందించిన అభిప్రాయాల ఆధారంగా విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు ఉంటుందని అన్నారు.
విద్యుత్ ప్లాంట్ నిర్మాణం వల్ల వచ్చే సామాజిక ఆర్థిక పర్యావరణ మార్పులు, ఎన్టిపిసి చేపట్టే చర్యలు , ప్రాజెక్టు వివరాలను అధికారులు ప్రజలకు పూర్తిస్థాయిలో వివరించారు. విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు వల్ల సమీప గ్రా మాలలో ఎన్టిపిసి సంస్థ సిఎస్ఆర్ నిధులతో చేపట్టాల్సిన అభివద్ధి పనులపై సైతం వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకుంటున్నా మని కలెక్టర్ తెలిపారు.
ఎన్టిపిసి రెండవ ఫేస్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణాన్ని సంబంధించి అన్ని వర్గాల ప్రజలు స్వాగతించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రీజనల్ అధికారి బిక్షపతి, రెవెన్యూ డివిజన్ అధికారి గంగయ్య, సెంట్రల్ ఎన్.బి.సి సభ్యులు బాబర్ సలీం పాషా, తెలంగాణ ప్రాజెక్టు హెడ్ చందన్ కుమార్ సమంత, స్వచ్ఛంద సంస్థల ప్రతిని ధులు, విద్యా సంస్థల ప్రతినిధులు పర్యావర ణవేత్తలు సామాజిక వర్కర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, సమీప గ్రామాలలోని ప్రజలు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యేతో పాటు పలువురు అరెస్ట్
ఎన్టిపిసిలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో అల్లార్లు సష్టించేందుకు ప్రయ త్నం చేస్తున్నారని అందిన సమాచారం మేర కు రామగుండం సిపి శ్రీనివాస్, గోదావ రిఖని ఏసిపి రమేష్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే కోరుకుంటి చందర్‌తో పాటు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.