calender_icon.png 9 October, 2024 | 3:29 PM

రైతులకు డిసిసిబి ద్వారా రూ.2350 కోట్ల విలువైన సేవలు అందించాం

09-10-2024 01:41:51 PM

ఉమ్మడి జిల్లా బీసీసీబీ బ్యాంకులో 96 శాతం రైతులకు రుణమాఫీ చేసాం 

100 కోట్ల టర్నోవర్ దాటిన డిసిసిబి గజ్వేల్ శాఖ 

సంబరాల్లో పాల్గొన్న డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి 

గజ్వేల్ (విజయక్రాంతి): ఉమ్మడి జిల్లాలో డిసిసిబి బ్యాంకు ద్వారా రైతులకు ఇప్పటివరకు రూ.2,350 కోట్ల సేవలు అందించడం జరిగిందని డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి అన్నారు. డిసిసిబి గజ్వేల్ శాఖ పూర్తి చేయడంతో బ్యాంకు మేనేజర్ రమేష్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. సంబరాల్లో పాల్గొని కేక్ కట్ చేసి మహిళా సంఘాలకు రుణాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఉమ్మడి జిల్లాలో డిసిసిబి బ్యాంకు 400 కోట్ల టర్నోవరకుండగా ప్రస్తుతం 2,350 కోట్లకు చేరుకుందన్నారు. జిల్లాలో 23 బ్రాంచ్ లతో  సేవలందించిన మా బ్యాంకు ప్రస్తుతం 49 బ్రాంచ్ ల ద్వారా రైతులకు విస్తృత సేవలు అందిస్తుంది అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి వరకు 3000 కోట్ల టర్నోవర్ చేరే అవకాశం ఉందన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి బ్యాంకు మరోసారి రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలువనుందన్నారు.

రైతులకు 650 కోట్లు పంట రుణాలు  సీఎం రేవంత్ రెడ్డి అందించిన రైతు రుణమాఫీతో రెండు లక్షల లోపు మాఫీ చేయడంతో పాటు రైతులకు రెట్టింపు రుణాలను అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే మహిళా సంఘాలకు  రూ.420 కోట్లు, బంగారు రుణాలు 270 కోట్లు ఇవ్వడం జరిగిందన్నారు. మహిళా సంఘాల గ్యారెంటీతో రుణాలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతులు ప్రజలు డీసీసీబి బ్యాంకుల ద్వారా రుణాలు పొంది సద్వినియోగం చేసుకోవాలని, ప్రైవేటు బ్యాంకులను, ఫైనాన్సులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు. గజ్వేల్ డీసీసీబీ రూ.30. 69 కోట్ల డిపాజిట్లు సేకరించగా, రైతులకు, మహిళా సంఘాలకు రూ.69 కోట్ల 34 లక్షల రూపాయల రుణాలు అందించామని డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి వెల్లడించారు.

గజ్వేల్ బ్రాంచ్ ద్వారా 30 వేల మంది రైతులకు, 7000 మంది మహిళా సంఘాల సభ్యులకు రుణాలు రుణాలు ఇవ్వడం జరిగిందన్నారు. డిసిసిబి బ్యాంకు ద్వారా ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీలో 96 శాతం రుణమాఫీ చేసి తిరిగి రెట్టింపు రుణాలు ఇవ్వడం జరిగిందని చిట్టి దేవేందర్ రెడ్డి తెలిపారు. రైతుల శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారధ్యంలో మరో 15 రోజుల్లో మూడవ విడత రుణమాఫీ ద్వారా మిగతా రైతులకు రుణమాఫీ చేసి తిరిగి రుణాలు తిరిగి రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్  రమేష్, పిఎసిఎస్ సీఈవో బాలయ్య, సిబ్బంది మహిళా సంఘాలు పాల్గొన్నారు.