- హైడ్రా కోసం ప్రత్యేకంగా ఎఫ్‌ఎం రేడియో
ఫైనల్ దశలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు ప్రక్రియ
చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల అడ్డుకట్టకు రూట్‌మ్యాప్ సిద్ధం
2024 వార్షిక నివేదిక అంశాలను వివరించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 28 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరంలో చినుకు పడితే చాలు.. రహదారులు, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నాయి. ఈ పరిస్థితులలో ప్రజలకు సవా మారుతున్న నిరంతర ఇబ్బందులను అధిగమించడానికి హైదరాబాద్ డిజిస్టార్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ (హైడ్రా) 5 నెలలుగా చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల తొలగింపునకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది.
ఈ మేరకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ 2024 వార్షిక నివేదిక అంశాలను అడిషనల్ డైరెక్టర్ పాపయ్య, ఇతర అధికారులతో కలిసి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. హైడ్రా ఏర్పాటైన 5 నెలల కాలంలో చెరువులు, ప్రభుత్వ స్థలా పార్కులను ఆక్రమణల నుంచి పరిరక్షించడంతో ఇప్పటి దాకా 200 ఎకరాలను కాపాడినట్టు రంగనాథ్ తెలిపారు. అందులో భాగంగా 12 చెరువులు, 4 ప్రభుత్వ స్థలాలలో ఆక్రమణలను తొలగించామన్నారు.
ఓఆర్‌ఆర్ పరిధిలో చెరువుల పరిరక్షణకు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లను నిర్ధారణ చేస్తున్నట్టు ప్రకటించారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో అనుమతులు లేకున్నా నివాసాలను కూల్చవేయమని, అనుమతులు లేని వ్యాపార, వాణిజ్య సముదాయాల నిర్మాణాలపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జంటనగరాలకు ప్రధాన నీటి వనరుగా ఉన్న ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారణ చేస్తున్నామన్నారు. ఇప్పటికే 550 చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్దారణ అయ్యిందన్నారు.
పూర్తిస్థాయి సాంకేతిక సమాచారం కోసం నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) అధికారులు 3 నెలల సమయం పడుతుందని చెప్పడంతో మొత్తం చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్దారణకు మరో 5నెలల సమయం పడుతుందన్నారు. ఇదే సమయంలో నాలాల సరిహద్దులకు కూడా మార్కింగ్ చేపడుతున్నామన్నారు. మరో నెల రోజుల్లో హైడ్రాకు ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు అవుతుందన్నారు.
1025వాటర్ బాడీస్ గుర్తింపు..
సర్వే ఆఫ్ ఇండియా టోపోషీట్స్, కడాస్ట్రాల్, గ్రామీణ మ్యాప్‌లు, రెవెన్యూ రికార్డులు, శాటిలైట్, ఏరియల్ ఇమేజెస్ ద్వారా ఇప్పటికే 1,025 నీటి వనరులను గుర్తించినట్టు రంగనాథ్ తెలిపారు. దీని కోసం ఎన్‌ఆర్‌ఎస్‌సీ, సర్వే ఆఫ్ ఇండియా, వివిధ శాటిలైట్ ఏజెన్సీలతో ఎంఓయూ చేసుకున్నట్టు తెలిపారు. కిర్లోస్కర్ నివేదికలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నా అన్నారు.
ఇప్పటి వరకూ హైడ్రాకు 5,800 ఫిర్యాదులను సీకరించి, దాదాపుగా పరిష్కరించినట్టు తెలిపారు. చెరువుల పరిరక్షణకు సీసీ కెమెరాలు, ప్రభుత్వ స్థలాలు, పార్కుల పరిరక్షణకు జియో ఫెన్సింగ్ ఏర్పా చేస్తున్నామన్నారు. చెరువులు, కుంటలు, నాలాల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల వివరాలను సాంకేతికంగా సమగ్ర సమాచారం సేకరించిన తర్వాత హైడ్రా వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామన్నారు. ఈ వివరాలతో భవిష్యత్తులో ప్రత్యేక యాప్ రూపొందిస్తామన్నారు. ఇప్పటి వరకు హైడ్రా చేపట్టిన కార్యక్రమాలతో భవిష్యత్ కార్యచరణకు సిద్ధం అవుతామని రంగనాథ్ తెలిపారు.
హైడ్రాకోసం ప్రత్యేక ఎఫ్‌ఎం రేడియో
ముఖ్యంగా వర్షాలు, వరదలు వచ్చినప్పుడు ఎలాంటి విపత్కర పరిణామాలు చోటుచేసుకున్నా ఖచ్చితమైన సమాచారం అందించి ప్రజలను అలర్ట్ చేసేందుకు హైడ్రా ప్రత్యేక ఎఫ్‌ఎం రేడియోను అందుబాటులోకి తీసుకురా ఈ రేడియో ద్వారా నగరంలో ఎక్కడ ఎంత వర్షపాతం నమోదవుతుందో.. ఎక్కడ ట్రాఫిక్ జామ్ నెలకొంది.. ఏ ప్రాంతంలో ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయో తెలియజేయనుంది.
ఎఫ్ రేడియో ఏర్పాటుపై ఇప్పటికే బడ్జెట్ అంచనాలు వేసిన హైడ్రా ప్రభుత్వంతో చర్చించనుంది. అలాగే ఆక్రమణలను తొలగించిన 12 చెరువులను పునరుద్దరిం ప్రభుత్వానికి నివేదిక పంపినట్టు హైడ్రా కమిషనర్ వెల్లడించారు. నగరంలో విపత్తుల నిర్వాహణకు ఇప్పటికే 30 డీఆర్‌ఎఫ్ బృందాలు ఉన్నాయనీ, వీటికి ఓఆర్‌ఆర్ పరిధిలోకి 72 బృందాలుగా పెంచుతున్నట్టు తెలియజేశారు. డీఆర్‌ఎఫ్ ద్వారా అందిన 4,684 ఫిర్యాదులను పరిష్కరించినట్టు తెలిపారు. వాతావరణ సూచికలు తెలియజేసేలా ఆటో మేటిక్ వెదర్ స్టేషన్స్‌ను ఎక్కువగా ఏర్పాటు చేయాల్సి ఉందని రంగనాథ్ తెలిపారు.