calender_icon.png 4 October, 2024 | 4:57 PM

మాకెలాంటి సంబంధం లేదు

04-10-2024 01:23:34 AM

  1. డ్రగ్ పెడ్లర్ తుషార్ ఆరోపణలు అబద్ధం
  2. ఇండియన్ యూత్ కాంగ్రెస్

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: ఢిల్లీలో భారీ ఎత్తు న్న డ్రగ్స్ పట్టుబడిన కేసులో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తుషార్ గోయల్‌తో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని అని ఇండియన్ యూత్ కాంగ్రెస్ గురువారం వెల్లడించింది. అబద్ధాల ఆధారంగా తప్పుదారి పట్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించింది.

ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేయడం మానుకో వాలని సూచించింది. దక్షిణ ఢిల్లీలో బుధవారం పోలీసులు నిర్వహించిన దాడిలో రూ.5600 కోట్ల విలువైన కొకైన్, 40 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి పట్టుబడింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి తుషా ర్ గోయల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

2022 వరకు తాను ఢిల్లీ పీసీసీ ఆర్టీఐ సెల్ చైర్మన్‌గా పనిచేశానని నిందితుడు పోలీసుల విచారణ చెప్పినట్లు సమాచారం. నిందితుడు గతంలో ఎంపీ దీపేందర్‌సింగ్, హర్యా నా పీసీసీ ఉదయ్‌భాను సహా కాంగ్రెస్ ప్రముఖులతో ఫొటోలను పోస్టు చేశాడు. నిందితుడి వ్యాఖ్యలను కాంగ్రెస్ తప్పుపట్టిన నేపథ్యంలో కేసు ఆసక్తిగా మారింది.