calender_icon.png 31 January, 2025 | 10:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్‌పై కేసులో మా జోక్యం లేదు

29-01-2025 12:56:38 AM

  1. ప్రజాధనం దుర్వినియోగమైందనే శాఖాపరమైన విచారణ
  2. చెన్నులో విద్యారంగ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క

హైదరాబాద్, జనవరి 28 (విజయక్రాంతి): ఫార్ములా ఈ కార్ రేసు వ్యవ హారంలో రాజకీయ పార్టీగా తాము చేసేందేమి లేదని, ప్రజాధనం దుర్వినియోగ మైందని ఆరోపణలు రావడంతోనే  కేటీఆర్‌పై కేసు నమోదై.. శాఖాపరమైన విచా రణ జరుగుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు.

మంగళవారం చెన్ను లో ఓ ప్రముఖ సంస్థ విద్యారంగంపై నిర్వహించిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క హాజరై పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తెలంగాణ విద్యార్థులు ప్రపంచంతో పోటీపడేలా సిద్ధం చేసేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నట్లు తెలిపారు.

విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొం దించేం దుకు తమ ప్రభుత్వం స్కిల్ యూ నివర్సిటీని స్థాపించిందన్నారు. పబ్లి క్ స ర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేసి జాబ్ క్యా లెండర్ విడుదల చేయడంతో పాటు యూ పీఎస్సీ తరహాలో ఉద్యోగాల భర్తీ చేపడుతున్నామ న్నారు. తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించామని, అందుకు తగిన విధంగా రాష్ర్ట సంపదను అర్హులైన పేదలకు పంచుతామని తెలిపారు.