- ఉందని నిరూపిస్తే వారికే రాసిస్తా
- మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): ఇథనాల్ కంపెనీతో తన కొడుకు సాయికిరణ్‌కు ఎలాంటి సంబంధం లేదని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ స్పష్టంచేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. తమ అసమర్థతను కప్పి పుచ్చుకునేందుకే కాంగ్రెస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి సీతక్క, ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి వ్యా ఖ్యలను ఖండించారు. తన కుటుంబ సభ్యులకు సంబంధం ఉన్నట్లు నిరూపిస్తే.. కంపెనీ వాళ్లే రాసిస్తానని పీసీసీ చీఫ్‌కు సవాల్ విసిరారు. ఇథనాల్ కంపెనీపై ఎక్కడంటే అక్కడ చర్చకు సిద్ధమన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోన్న వారికి తానేంటో చూపిస్తానని హెచ్చరించారు.
2016లో ఏపీలోని రాజమండ్రి ప్రాంతంలో తన కుమారుడు వేరే కంపెనీని పెట్టాలనుకున్నది వాస్తవమని, అయితే మూడు నెలలకే కంపెనీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారని వెల్లడించారు. కంపెనీ పెట్టించే వాళ్లం మేమే అయితే.. రైతులను మేమెందుకు రెచ్చగొడుతామని చెప్పారు. కంపెనీకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని పేర్కొనడం విడ్డూరంగా ఉందని అన్నా రు.
ఇథనాల్ కంపెనీకి అనుమతులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అన్న విషయం కూడా తెల్వదా అని ప్రశ్నించారు. తనను, బీఆర్‌ఎస్ పార్టీని బదనాం చేసే ప్రయత్నం జరుగుతుందన్నారు. గురుకులాల్లో విద్యార్థుల మృతిపై కోర్టు మెట్టికాయలు వేసిందని విమర్శించారు.