calender_icon.png 19 April, 2025 | 11:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల అభివృద్ధిని కోరుకునే నాయకున్ని కోల్పోయాం

11-04-2025 01:14:04 AM

మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్

తుంగతుర్తి ఏప్రిల్ 10: పేద ప్రజల అభ్యున్నతిని కోరే నాయకుడు దాయం మిక్రమ్ రెడ్డిని కోల్పోవడం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు. గురువారంతుంగతుర్తి మండలం వెంపటి గ్రామంలో మాజీ మార్కెట్ చైర్మన్ దాయం విక్రమ్ రెడ్డి  ఇటీవల మరణించడంతో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులైన దాయం సుజాత, దాయం ఝాన్సీ రెడ్డి, దాయం పృథ్వి రెడ్డిలను పరామర్శించి,  మాట్లాడారు.

విక్రం రెడ్డి రాజకీయ జీవితంలో రెండుమార్లు సర్పంచ్ గా ,ఒక మారు తిరుమలగిరి మార్కెట్ చైర్మన్ గా పదవులు పొందినప్పటికీ ఏనాడు కూడా, సంపాదన మీద తన మనసు పెట్టకుండా ప్రజల కోసమే నిరంతరం శ్రమించిన  నాయకుడు విక్రమ్ రెడ్డి అని కొనియాడారు.

ఆయన గ్రామంలో చేసిన సేవలు మరువలేని మని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీచెర్పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు   మండల పార్టీ అధ్యక్షులు, తాటికొండ సీతయ్య వైస్ ఎంపీపీ శ్రీశైలం యాదవ్ తునికి సాయిలు కొండగడుపుల నాగయ్య తునికి లక్ష్మి  దుర్గయ్య మాజీ ఎంపీపీలు గుండ గాని కవితా రాములు గౌడ్ పాల్గొన్నారు