calender_icon.png 11 October, 2024 | 5:58 AM

గొప్ప దార్శనికుడ్ని కోల్పోయాం

11-10-2024 01:43:04 AM

రతన్ టాటాకు పారిశ్రామికవేత్తల నివాళి

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: దేశీయ వాణిజ్య, దాతృత్వ విభాగాలను సమూలంగా మార్చివేసిన గొప్ప దార్శనికుడ్ని కోల్పోయామని రతన్ టాటాకు పారిశ్రామిక ప్రముఖలు నివాళి అర్పించారు. 

* రతన్ టాటా వెళ్లిపోవడం టాటా గ్రూప్‌కే కాదు, ప్రతీ భారతీయుడికి తీర్చలేని నష్టం.ఆమర దార్శనిక పారిశ్రామికవేత్తే కాదు. సమాజానికి ఎంతో మంచి చేసే దాత కూడా. నా ప్రియ స్నేహితుడ్ని కోల్పోయా. నా హృదయంలో ఎప్పటికీ నిలిచి ఉంటారు

 ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్

* ఆధునిక భారత బాటను పునర్ నిర్వచించిన  దిగ్గజ దార్శనికు డ్ని దేశం కోల్పోయింది. రతన్ టాటా వంటి లెజెండ్స్ చిరస్మరణీయులు

 గౌతమ్ అదానీ,  అదానీ గ్రూప్ చైర్మన్

* రతన్ టాటా మెం టార్‌షిప్, గైడెన్స్ విలు వ కట్టలేనివి. మిస్టర్ టి. నిన్ను మర్చిపోలేము. ఎందుకంటే లెజండ్స్‌కు మరణం లేదు.

ఆనంద్ మహీంద్ర, మహీంద్ర గ్రూప్ చైర్మన్

* టాటా గ్రూప్‌ను నైతిక విలువల్లోనే ఉంచుతూ రతన్ టాటా అంతర్జాతీయ వ్యాపార శక్తిగా మలిచారు

 శ్రీనివాసులు శెట్టి, ఎస్బీఐ చైర్మన్

* రతన్ దార్శనీకత దేశంలో, ప్రజల్లో మా ర్పు తీసుకువచ్చింది. అ లాంటివారు శతాబ్దానికి ఒక్కరే ఉంటారు

 వేణు శ్రీనివాసన్, టీవీఎస్ చైర్మన్ 

* రతన్ టాటా నిర్ణయాలు దేశంలో పరిశ్ర మలు, జీవితాలపై ఎం తో ప్రభావంచూపాయి

 కుమార మంగళం బిర్లా, ఆదిత్యా బిర్లా గ్రూప్ అధిపతి

* రతన్ టాటా వ్యక్తిత్వంతో ప్రతీ భారతీ యుడికి ఒక ఐకాన్‌గా నిలిచారు

 అనిల్ అగర్వాల్, వేదాంత గ్రూప్