05-04-2025 06:08:05 PM
మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దరాస్ సాయిలు..
మద్నూర్ (విజయక్రాంతి): మద్నూర్ మండలంలోని రూసేగావ్ గ్రామానికి చెందిన రామ్ రావు డోంగ్లికర్ ఇటీవల మృతి చెందడం పట్ల ఓ మంచి కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ కోల్పోయిందని మండల పార్టీ అధ్యక్షులు దరాస్ సాయిలు తెలిపారు. ఇటీవల రూశేగావ్ గ్రామానికి చెందిన రామ్ రావు డోంలికర్ ప్రమాదంలో గాయపడి మృతి చెందారు. ఆయన మృతికి సంతాప సూచికంగా ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు శనివారం నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ తాజా మాజీ సర్పంచ్ గోవింద్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమాన్లు, స్వామి, మద్నూర్ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్, మాజీ ఎంపీపీ ప్రజ్ఞా కుమార్, కొండ గంగాధర్, మండల యూత్ అధ్యక్షులు అనుమంతు యాదవ్, వట్నాల రమేష్, బండి గోపి, కర్ల సాయిలు, తూమ్ రాములు తదితరులు పాల్గొన్నారు.