calender_icon.png 14 January, 2025 | 5:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత దౌత్యవేత్తలపై నిఘా ఉంచాం

20-10-2024 03:05:18 AM

మరోసారి కెనడా వివాదాస్పద వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 19: భారత్‌తో సంబంధాలు తీవ్రంగా దెబ్బతింటున్నా కెనడా తీరు మాత్రం మార ట్లేదు. భారత్‌పై ఆ దేశ ప్రధాని ట్రూడో తీవ్రస్థాయిలో అక్కసు వెల్లగక్కుతుండగా.. మంత్రివర్గం కూడా అదే పనిగా విమర్శిస్తోంది. తాజాగా ఆ దేశ విదేశాంగ మంత్రి మెలానీ జోలీ భారత్‌పై బురదజల్లే ప్రయ త్నంచేశారు. కెనడాలో ఉన్న భారత దౌత్యవేత్తలపై నిఘా ఉంచామంటూ కామెంట్ చేశారు.

అంతటితో ఆగకుండా భారత్‌ను రష్యాతో పోలు స్తూ అక్కసు వెళ్లగక్కారు. మెలానీ మాట్లాడుతూ.. ‘మా దేశ చరిత్రలో ఇలాంటి పరిస్థితి ఎప్పు డూ చూడలేదు. అంతర్జాతీయ శక్తులు కెనడా గడ్డపై ఇలాంటి అణచివేతకు పాల్పడటాన్ని మేం సహించం. జర్మనీ, యూకేలో రష్యా అణిచివేతకు ప్రయత్నించింది. ఇంట్లాంటివాటికి వ్యతిరే కంగా దృఢంగా నిలబడాల్సిన అవసరం ఉంది’ అని జోలి పేర్కొన్నారు.