calender_icon.png 25 March, 2025 | 11:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

6.47 లక్షల రేషన్ కార్డులిచ్చాం

22-03-2025 02:18:15 AM

మాజీ మంత్రి హరీశ్ రావు

హైదరాబాద్, మార్చి 21 (విజయక్రాంతి): గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో 6.47,479 రేషన్ కార్డులను జారీ చేసినట్లు మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన బడ్జెట్‌పై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయరమణా రావు లేవనెత్తిన అంశంపై హరీశ్ స్పందించారు. మా హయాంలో 20 లక్షలకు పైగా కొత్త సభ్యులను కార్డుల్లో చేర్చినట్లు తెలిపారు.

వేల కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం నిర్మిస్తే..అది కూలిపోయిందని విమర్శించడాన్ని తప్పుబట్టిన హరీశ్.. ఒక బ్లాక్ లో ఒక పిల్లర్ కూలిపోతే మొ త్తం కాళేశ్వరమే కూలిపోయినట్లుగా కాంగ్రెస్ మాట్లాడుతుందన్నారు. దీనికి బదులిచ్చిన విజయరమణారావు ‘కట్టింది నిజమే...కూలిందీ నిజమేనని స్వయంగా హరీష్ రావే ఒప్పుకున్నారని’ ఎద్దేవా చేశారు.