calender_icon.png 3 November, 2024 | 1:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలనలో స్పీడు పెంచాం

01-07-2024 12:05:00 AM

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

హైదరాబాద్, జూన్ 30(విజయక్రాంతి): కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతోందని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత పాలనపై దృష్టి పెట్టినట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత గేరు మార్చామని, పాలనలో వేగం పెంచామని స్పష్టం చేశారు. ఆదివారం నగరంలోని ఓ హోటల్‌లో రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. సమాజ సేవ కోసం రాష్ట్ర ప్రభుత్వంతో రోటరీ క్లబ్ భాగస్వామం కావాలని పిలుపునిచ్చారు. క్లబ్ నూతన అధ్యక్షుడిగా సుశీల్ కుమార్, కొత్త ఆఫీస్ బేరర్లు ప్రమాణస్వీకారం చేశారు. వనపర్తి జిల్లా విద్యార్థులకు మంత్రి శ్రీధర్ బాబు ఆరు సైకిళ్లను పంపిణీ చేసి.. ఒక విద్యార్థినికి స్కూలు ఫీజును అందించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్  కూడా పాల్గొన్నారు.