26-02-2025 01:40:59 AM
హరీశ్‌రావు ఆరోపణలపై జలమండలి వివరణ
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): నగరంలో 2021 నుంచి ఏటా 10 శాతం వాటర్ ట్యాంకర్ల డిమాండ్ పెరుగుతోందని జలమండలి అధికారులు తెలిపారు. నగరంలో తాగునీటి సమస్య తీవ్రమవుతోందని, వాటర్ ట్యాంకర్లను తెప్పిందుస్థితి ఏర్పడిందని మంగళవారం మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.
జల అధికారులు స్పందిస్తూ ప్రతీ ఏడాది మాదిరి గానే ఈసారి కూడా ట్యాంకర్ల డిమాం డ్ పెరిగిందని ప్రకటనలో తెలిపారు. 2021 32శాతం, 20 23లో 19శాతం, 2023 31శా తం, 2024 ఫిబ్రవరి వరకు 37 శాతం మేర డిమాండ్ పెరిగిందన్నారు. 2024జనవరి నాటికి 69 ఫిల్లింగ్ స్టేషన్లు, 93 ఫిల్లింగ్ పాయింట్లు ఉంటే వాటిని 123కు పెంచామన్నారు. గతేడాది జనవరిలో 577 ట్యాంకర్లు ఉంటే ఈ ఏడాది వరకు వాట సంఖ్యను 907కు పెంచినట్లు తెలిపారు.