calender_icon.png 24 October, 2024 | 1:51 PM

ఎమ్మార్పీఎస్ నేతను నిర్బంధించిన ఫాంహౌస్‌ను గుర్తించాం: డీసీపీ

15-07-2024 12:42:56 AM

రాజేంద్రనగర్, జూలై 14: ఇటీవల నార్సింగిలో కిడ్నాప్‌కు గురైన ఎమ్మార్పీఎస్ నేత నరేందర్‌ను దుండగులు నిర్బంధించిన ఫాంహౌస్‌ను గుర్తించినట్లు రాజేంద్రనగర్ డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. శంషాబాద్‌లోని ధర్మగిరి సమీపంలో దుండగులు నరేందర్‌ను నిర్బంధించిన దాడికి పాల్పడినట్లు తెలిపారు. భూ వివాదాల నేపథ్యంలో ఈ నెల 9వ తేదీన నార్సింగిలోని బృందావ న్ కాలనీలో ఉన్న తన ఇంట్లో నుంచి బయలుదేరిన నరేందర్ కనిపించకుండా పోయా డు. కిడ్నాప్‌నకు గురైనట్లు పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. నరేందర్‌ను కిడ్నాప్ చేసిన దుండగులు శంషాబాద్‌లోని ధర్మగిరి సమీపంలో ఉన్న ఓ ఆలయంలో నిర్బంధించి చిత్రహింసలకు పాల్పడ్డారు.

ఈ క్రమంలో ఆయన చేయి కూడా విరిగిపోయిందని కుటుంబీకులు తెలిపారు. దుండగులున్న ఫాంహౌ స్‌కు భారీ ఎత్తులో ప్రహరీలు, ముళ్ల కంచెలు ఉన్నట్లు డీసీపీ శ్రీనివాస్ ఆదివారం పేర్కొన్నారు. సీసీ కెమెరాలను దుండగులు అమర్చుకున్నట్లు గుర్తించారు. ఇదిలా ఉండ గా శనివారం తెల్లవారుజామున నార్సింగి పోలీసులు నరేందర్‌ను వెతికేందుకు వెళ్లగా బృందావన్ కాలనీ సమీపంలో రౌడీగ్యాంగ్ పోలీసులపైకి కత్తులు, హాకీ స్టిక్స్‌తో కొట్టేందుకు యత్నించగా.. అదనపు బలగాలు చేరుకోవడంతో పరారయ్యారు. వారిలో నలుగురు రౌడీషీటర్లను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కిడ్నాప్ కేసు లో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.