calender_icon.png 24 December, 2024 | 8:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒకటిన్నర ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం

24-12-2024 01:45:58 AM

* రోజ్‌గార్ మేళాలో 71 వేల మందికి అపాయింట్‌మెంట్ లెటర్స్

* గత ప్రభుత్వాలు ఉపాధి కల్పించలేకపోయాయి

* 2047 కల్లా వికసిత్ భారత్  

* ప్రధానమంత్రి మోదీ

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: గత ఏడాదిన్నర కాలంలో తమ ప్రభుత్వం రికార్డు స్థాయిలో యువతకు 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. సోమవారం రోజ్‌గార్ మేళా వర్చువల్ కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా 71 వేల మందికి అపాయింట్‌మెంట్ లెటర్స్ అందజేశారు. ఈ సంద ర్భంగా మోదీ మాట్లాడుతూ పారదర్శకత వల్లే నియామక ప్రక్రియ వేగంగా జరిగిందన్నారు.

ఇవాళ ఉద్యోగాలు  పొందిన వారి లో ఎక్కువ శాతం మంది మహిళలు ఉన్న ట్లు తెలిపారు. మహిళలు అన్నిరంగాల్లో స్వయంప్రతిపత్తిన సాధించాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అన్ని ప్రాంతాల యువతకు అనుకూలంగా ఉండేందుకు 13 భారతీయ భాషల్లో నియామక పరీక్షలు నిర్వహించాలని కేంద్రం ఆలోచిస్తున్నదని తెలిపారు.వీలైనంతగా యువత సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని తమ ప్రభుత్వం వాడుకుంటోందన్నారు.

అనేక పథకాల ప్రారంభానికి వారు కేంద్రంగా మారారని పేర్కొన్నారు. గతంలో ఏ ప్ర భుత్వం కూడా ఈ స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. ఇప్పటివరకు తమ పాలనలో యువతకు భారీగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారు. ఉద్యోగాలు పొందిన వారు నిజాయితీతో దేశం కోసం పనిచేస్తున్నారని ప్రశంసించారు. 2047 కల్లా వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.

దేశాభివృద్ధి యువతపైనే ఆధారపడి ఉందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత యువతకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా. ఆత్మనిర్భర్ భారత్, డిజిటల్ ఇండియా లాంటి కార్యక్రమాలను నిర్వహించామన్నారు. ప్రస్తుతం భారత్ అన్ని రంగా ల్లో దూసుకెళూ..్త అంతరిక్షం, రక్షణ, పునరుత్పాదక ఇంధనం, టూరిజం రంగాల్లో అగ్రగామిగా ఎదిగిందని మోదీ పేర్కొన్నారు.   

కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ రోజ్‌గార్  మేళాలో ఇచ్చిన  71,000 ఉద్యోగాల్లో ఓబీసీలు 29 శాతానికి పైగా, ఎస్సీలు 15.8 శాతం. ఎస్టీలు 9.6 శాతం ఉన్నారని తెలిపారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే తమ ప్రభుత్వ హయాంలో 27 శాతం పెరిగిందని వెల్లడించారు.