calender_icon.png 17 January, 2025 | 3:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

200 కోట్లతో అభివృద్ధి పనులు చేశాం

17-01-2025 01:02:03 AM

రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

రాజేంద్రనగర్, జనవరి 16: 200 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేశామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు.  శంషాబాద్ మున్సిపాలిటీలోని రాళ్లగూడ, ఇంద్రరెడ్డి నగర్ కాలనీలో రూ.70 లక్షల టి యు ఎఫ్ ఐ డి సి నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను గురువారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. శంషాబాద్ మున్సిపాలిటీ ఏర్పడిన తరువాత ఇప్పటివరకు దాదాపు 200 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులను చేపట్టి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచినట్లు వివరించారు.

రానున్న రోజుల్లో కూడా పార్టీలకతీతంగా మున్సిపల్ అభివృద్ధికి అందరం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మా మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్, సీనియర్ నాయకులు గణేష్ గుప్తా, దూడల వెంకటేష్, పలువురు కౌన్సిలర్లు, కమిషనర్ సుమన్ రావు తదితరులు పాల్గొన్నారు.