calender_icon.png 30 July, 2025 | 5:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్బంధం లేని అధికార వ్యవస్థను రూపొందించాం

10-04-2025 01:12:02 AM

36 కేంద్రపాలిత ప్రాంతాల్లో మన రాష్ట్రం 35వ స్థానంలో ఉంది 

రెండవ తరగతి పుస్తకం ఎనిమిదో తరగతి విద్యార్థి చదవలేక పోతున్నాడు

మన బిడ్డలకు జ్ఞానాన్ని అందించినప్పుడు మన జీవితం సార్థకం 

కలెక్టర్‌కు విద్యానిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి 

హబూబ్ నగర్ ఏప్రిల్ 8 (విజయ క్రాంతి) : నిర్బంధంలో లేని అధికార వ్యవస్థను రూపొందించి అందించడం జరుగుతుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్ లో టిఎన్జీవోస్ ఆధ్వర్యంలో సమకూర్చిన రూ 10 లక్షల చెక్కును జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి కి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన సదుపాయాల ను పూర్తిస్థాయిలో కల్పించే లక్ష్యంతోని విద్యానిధిని ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. వెనకబడిన ఒక తరానికి మంచి జ్ఞానాన్ని అందిస్తే ప్రపంచంతో పోటీపడి మన ప్రాంతాన్ని ఉన్నత స్థానంలో ఉంచుతారని పేర్కొన్నారు.

ఎస్త్స్ర, కానిస్టేబుల్, వీఆర్‌ఏ, వీఆర్వో, టెట్, డీఎస్సి పోటీ పరీక్షలకు సంబంధించి ఈనెల 16వ తేదీ నుంచి ఉచితంగా అంబేద్కర్ కళాభవన్ లో శిక్షణ అందజేస్తున్నట్లు తెలిపారు. అన్ని పనులు ప్రభుత్వం చేస్తుందే కదా అని ఊరుకుంటే ఒక తరం పూర్తిగా వెనుకబడిపోతుందని అది మంచిది కాదు అని తెలిపారు. మీరు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా పూర్తిస్థాయిలో విద్యకు ఖర్చు చేస్తామని తెలిపారు. భవిష్యత్తులో నేను ఈ స్థలంలో ఉన్నా లేకపోయినా మరో 50 ఏళ్లు విద్య నిధి ముందుకు తీసుకుపోవడం జరుగుతుందని తెలిపారు.

అధికారులకు ఎవరు వచ్చిన విద్య అనేది పేద విద్యార్థుల కోసం పనిచేస్తుందని స్పష్టం చేశారు. విద్యార్థులకు ఏది బాగుండాలో చెబితే వాటికి పరిగెలోకి తీసుకొని పూర్తిస్థాయిలో సదుపాయాలను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. విద్యా నిధి రూపకల్పనకు జిల్లా కలెక్టర్ ఎంతో శ్రమిస్తున్నారని, కలెక్టర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే 10 లర్నింగ్ సెంటర్లో అందుబాటులోకి వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామనీ పేర్కొన్నారు. మొత్తం 20 లర్నింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని, అనుభవం ఉన్న ఒక ఉన్నత చదువు చదివిన వ్యక్తిని అందుబాటులో ఉంచి ఉచితంగా విద్యార్థిని విద్యార్థులకు వివిధ పాఠ్యాంశాలలో శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

దేశంలో 36 కేంద్ర పాలిత ప్రాంతాలలో మన రాష్ట్రం 35 స్థానంలో ఉందని, అందరం శ్రమిస్తే అభివృద్ధివైపు ముందుకు సాగి మొదటి స్థానంకి వస్తామని తెలిపారు. ఉద్యోగులు అందిస్తున్న సహకారాన్ని భవిష్యత్తు తరాలు వారి జీవితాంతం గుర్తుంచుకుంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు    శివేంద్ర ప్రతాప్, మోహన్ రావు, టి పిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ , టిఎన్జీఓ అధ్యక్షులు రాజీవ్ రెడ్డి, కార్యదర్శి చంద్రా నాయక్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.