calender_icon.png 23 November, 2024 | 8:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివరాలు సమగ్రంగా సేకరించాం

23-11-2024 03:43:49 AM

త్వరలోనే ప్రభుత్వానికి నివేదిస్తాం 

బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ 

మహబూబ్‌నగర్‌లో బహిరంగ విచారణ 

మహబూబ్‌నగర్, నవంబర్ 22 (విజయక్రాంతి): బీసీల సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన స్థితిగతులు, వెనకబాటుతనం, వారికి కల్పించాల్సిన సదుపా యాలను పూర్తిస్థాయిలో కల్పించాలనే లక్ష్యంతోనే బహిరంగ విచారణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ అన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా అధికారుల సమీకృత కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన బహిరంగ విచారణలో ఆయన పాల్గొన్నారు.

వివిధ కుల సంఘాల నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 135 వరకు విజ్ఞప్తులను స్వీకరించినట్టు తెలిపారు. ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా 85 నుంచి 95 శాతం మేరకు సమగ్ర సర్వే పూర్తి అయిందన్నారు. సమగ్ర వివరాలు సేకరించామని, త్వరలోనే ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. ప్రతి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. బీసీలకు సముచిత సదుపాయాలను దరిచేర్చేందుకు ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.

ఈ సమావేశంలో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మైనార్టీ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఓబేదులా కొత్వాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనితమధుసూదన్‌రెడ్డి, పలు అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరునగరి సురేందర్, రంగుబాల లక్ష్మీ,  కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ జానకి, అదనపు కలెక్టర్లు మోహన్‌రావు, శివేంద్రప్రతాప్ పాల్గొన్నారు.