మానకొండూర్, జనవరి 19: తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని పదేళ్లు తెలంగాణ ప్రజలకు దేవుడిగా మారిన కేసీఆర్ ప్రభు త్వాన్ని వదులుకొని దయ్యం లాంటి రేవంత్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడంతో తెలంగా ణ ప్రజలు బాధపడుతున్నారని మానకొం డూరు మాజీ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆరోపించారు ఆదివారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని కొత్త పల్లి గ్రామంలో బీఆర్‌ఎస్ కార్యకర్తల సమా వేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పార్టీలో కరడు కట్టి న కార్యకర్తలు పార్టీకి సొంతమని కానీ కాంగ్రె స్ మాయమాటలు మోసపూరిత వాగ్దానా లతో ప్రభుత్వాన్ని గెలిపించుకొని ఇప్పుడు కోసపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు 6 గ్యారంటీలలో 5 పథకాలను ఇప్పటికే తెలంగాణ ప్రజలకు అందించామని గొప్ప లు చెప్పుకుంటున్నరణి ఎద్దేవ చేశారు.
ప్రస్తు త ఎమ్మెల్యే అనుచరుడు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నప్పటికీ ఎమ్మెల్యే పట్టించు కోకపోవడం సిగ్గుచేటు అన్నారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకష్ణా రావు, మా జీ ఎంపీపీ వనితా దేవేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, పోరండ్ల సింగిల్ విండో చైర్మన్ సింగిరెడ్డి స్వామిరెడ్డి, నుస్తు లాపూర్ సోసైటీ చైర్మన్ గుజ్జుల రవీందర్ రెడ్డి, పాశం అశోక్ రెడ్డి, మాతంగి లక్ష్మణ్, తో పాటు మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.