మన పూర్వ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి స్మృతికి గుర్తుగా పెట్టిన ‘లాల్ బహదూర్‌శాస్త్రి నగర్’ను సంక్షిప్తంగా ‘ఎల్‌బీ నగర్’ అని పిలువడం బాగా లేదు. రాష్ట్ర ఆర్టీసీ బస్సుల బోర్డులన్నింటిపైనేకాక హైదరాబాద్ మెట్రో స్టేషన్‌ను కూడా అలాగే షార్ట్‌గా పేర్కొనటం విచారకరం. ఒక పేరెన్నిక గన్న వ్యక్తి పేరును ఓ ప్రాం తానికి పెట్టుకున్నప్పుడు దానిని ఆ విధంగా వ్యవహరించటమే సమంజసం. లేకపోతే, అసలు ఉద్దేశ్యం దెబ్బతింటుంది. ఇది ప్రజలు, ప్రభుత్వాలు గుర్తెరగాలి. ఇకనైనా, ఎల్‌బీ నగర్‌ను సంక్షిప్తంగా కాకుండా పూర్తిగా ‘లాల్ బహదూర్‌శాస్త్రి నగర్’గా వ్యవ హరించాలి. అందుకు తగ్గట్టుగా కావలసిన చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి.
కప్పగంతు వెంకట రమణమూర్తి, సికింద్రాబాద్