calender_icon.png 4 April, 2025 | 5:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా కథకు తగ్గట్టుందనే పవన్ సినిమా టైటిల్ పెట్టాం!

03-04-2025 12:00:00 AM

టీవీ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన చిత్రం ‘అక్కడ అమ్మా యి ఇక్కడ అబ్బాయి’. దర్శక ద్వయం డుయో నితిన్, భరత్ దర్శకత్వంలో మాంక్స్‌అండ్‌మంకీస్ బ్యానర్‌పై రూపొందుతోందీ సినిమా. దీపికా పిల్లి కథానా యికగా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 11న థియేటర్లలోకి  రానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకులు నితిన్, భరత్ విలేకరులతో సినిమా విశేషాలను పంచుకున్నారు. “మేము టెలివిజన్‌లో డిఫరెంట్ షోస్ చేశాం.

అప్పటినుంచి ప్రదీప్ పరిచయం. ఒకసారి ఈ ఐడియా చెప్తే, బావుందన్నా రు. తర్వాత స్క్రిప్ట్ నరేషన్ చెప్పాం. ఆయనకు నచ్చింది. అలా ఈ సిని మా ప్రారంభమైంది. మా ఈ చిత్రానికి పెట్టింది పవన్‌కళ్యాణ్ సినిమా టైటిల్ కాబట్టి పబ్లిసిటీపరంగా ప్లస్ అవుతుంది. అయి తే, మా కథకు ఆ టైటిల్ సరిగ్గా సరిపోతుందనే పెట్టాం. టెలివిజన్, మూవీ రెండూ వేర్వేరు. నాన్ ఫిక్షన్‌లో జడ్జిమెంట్ ఈజీగా తెలుస్తుంది.

కానీ సినిమా అలా కాదు.. ఒక్కో సీన్ ఒక్కో టైమ్‌లో ఒక్కో పరిస్థితిలో షూట్ చేయాల్సి వస్తుంది. దాని ఫలితం సినిమా రిలీజ్ వరకూ అర్థం కాదు. హీరోయిన్ క్యారెక్టర్ ఒక తెలుగమ్మాయితో చేయించాలనుకున్నాం. ఆ పాత్రకు దీపిక పిల్లి పర్ఫెక్ట్‌గా ఫిట్ అయింది. -మైత్రి మూవీ మేక ర్స్ మా ఫస్ట్ ఆడియన్స్.

వాళ్లు సినిమా చూసి, ఇందులో చాలా పొటెన్షియల్ ఉందని చెప్పారు. ఇది వేసవికి రావాల్సింది సినిమా అని వారే రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఇక మా రాబోయే సినిమాల గురించి చెప్పాలంటే.. -కొన్ని కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ తర్వాత వాటి గురించి ఆలోచిస్తాం” అని చెప్పారు.