29-04-2025 01:34:54 AM
శ్రీనగర్, ఏప్రిల్ 28: కశ్మీర్ అందాలను చూసేందుకు విచ్చేసిన అతిథులను కాపాడుకోవడంలో విఫలమయ్యామని జమ్మూ కశ్మీ ర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రదాడిలో మృతి చెందిన 26 మంది పర్యాటకుల ప్రాణాలను అడ్డుపెట్టుకొని రాష్ట్ర హోదాను డిమాండ్ చేయ లేమన్నారు.
పహల్గాం ఉగ్రదాడిపై చర్చించేందుకు సోమవారం కశ్మీర్ అసెంబ్లీ అత్య వసరంగా సమావేశమైంది. ఈ సందర్భంగా సీఎం ఒమర్ అబ్దుల్లా మాట్లాడారు. పహ ల్గాం ఉగ్రదాడిని రాజకీయంతో ముడిపెట్టడం సరికాదని పేర్కొన్నారు. ఈ ఉగ్రదా డిని అసెంబ్లీ సాక్షిగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి దాడులు గతంలో చాలా చూశామని, కానీ బైసరన్‌లో ఇంత పెద్ద దాడి జరగడం 21 ఏళ్లలో ఇదే తొలిసారని గుర్తుచేశారు. మృతి చెందిన వారి కుటుంబస భ్యులకు ఎలా క్షమాపణలు చెప్పాలో కూడా తెలియడం లేదన్నారు.
రాష్ట్రానికి విచ్చేసిన పర్యాటకులను సురక్షితంగా తిరిగి పంపిచాల్సిన బాధ్యత తమదేనని, కానీ ఆ పని చేయడంలో తమ ప్రభుత్వం విఫలమవ్వడం బాధాకరమన్నారు. పహల్గాం ఘటన తర్వా త ఏం ముఖం పెట్టుకొని ప్రత్యేక రాష్ట్ర హో దాను డిమాండ్ చేయగలమన్నారు. ప్రజల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తే మిలిటెన్సీ, ఉగ్రవాదం అంతమవుతాయన్నారు.
తుపాకులతో ఉగ్రవాదులను అదుపు చేసే అవకాశమున్నప్పటికీ బాధ్యత గల ప్రభుత్వంగా ఆ పని చేయలేమని ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు. అనంతరం 26 మంది మృ తుల వివరాలను సీఎం ఒమర్ అబ్దుల్లా చ దువుతూ ఉద్వేగానికి లోనయ్యారు. ఈ నేపథ్యంలో వారి మృతికి సంతాపంగా సభ్యులం తా రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆ తర్వాత సభ నిరవధిక వాయిదా వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.
కొనసాగుతున్న ముష్కరుల వేట
పహల్గాం ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాల వేట కొనసాగుతోనే ఉంది. ఉగ్రదాడిలో పాల్గొన్న ఆ నలుగురి లొకేషన్లను భద్రతా దళాలు నాలుగు సార్లు గుర్తించినప్పటికీ తృటిలో తప్పించుకున్నారు. తొలుత అనంత్‌నాగ్‌లోని పహల్గాం తెహస్లీ వద్ద, రెండోసారి కుల్గాం అడవుల్లో, మూడోసారి త్రాల్ కొండల్లో, చివరగా కొకెర్నాగ్‌లో ఉగ్రవాదుల కదలికలు కనిపించాయి. ఈ సందర్భంగా భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఒకసారి కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. దక్షిణ కశ్మీర్‌లోని అడవుల్లో ఉగ్రవాదులు నక్కినట్టుగా తమ వద్ద ఆనవాళ్లు ఉన్నాయని భారత సైనికాధికారి వెల్లడించారు. దట్టమైన అడవుల కారణంగా ఆచూకీ కష్టంగా మారినప్పటికీ వారిని పట్టుకొని తీరుతామన్నారు.
పహల్గాంకు పెరిగిన పర్యాటకుల తాకిడి
ఉగ్రదాడి అనంతరం జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో తిరిగి సందడి వాతావరణం నెలకొంటుంది. ఉగ్రదాడి జరిగిన ఐదు రోజులకే పహల్గాంకు వచ్చే పర్యాటకుల తాకిడి పెరగడం విశేషం. మన దేశంలోని పలు ప్రాంతాల నుంచి వస్తున్న పర్యాటకులతో పాటు విదేశీ టూరిస్టులతో పహల్గాం ప్రాంతం కళకళలాడుతోంది. అయితే ఉగ్రదాడి జరిగిన బైసరన్ మైదానం ప్రాంతాన్ని మాత్రం మూసివేశారు.