- ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్
న్యూఢిల్లీ, జూలై 22: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటును తక్కువ స్థాయిలోనేఆర్థిక సర్వే అంచనా వేసిందని, రుతుపవనాల ప్రగతిపై ఆధారపడి ఉన్నందున ఆచితూచి వృద్ధి అంచనాల్ని రూపొం దించామని ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) అనంత నాగేశ్వరన్ చెప్పారు. పార్ల మెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సర్వే విడుదల చేసిన అనంతరం నాగేశ్వరన్ మీడియాతో మాట్లాడుతూ 6.5 శాతం వృద్ధి రేటును జాగ్రత్తగా అంచనా వేశామని తెలిపారు. ఆర్థిక వ్యవస్థలో మూమెంటం ఉన్నదని, ప్రైవేటు మూ లధన వ్యయాలు పెరిగాయన్నారు. ఇతర వర్థమాన దేశాలతో పోలిస్తే భారత్ విదేశీ రుణ నిష్పత్తి చాలా తక్కువని చెప్పారు. ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నదని, ఆహారోత్పత్తులను మినహాయిస్తే ప్రధాన ద్రవ్యో ల్బణం 4 శాతం దిగువనే ఉన్నదని సీఈఏ వివరించారు.
కుటుంబాలు బాధల్లో లేవు
దేశంలో పొదుపు తగ్గినట్టు వస్తున్న వార్తలపై అనంతనాగేశ్వరన్ స్పందిస్తూ కుటుం బాలు బాధల్లో లేవని, షేర్లు, బాండ్లు తదితర ఆర్థిక ఆస్తుల్లో మరింతగా పెట్టుబడులు చేస్తున్నాయని, పొదుపును ఫైనాన్షియల్ మార్కె ట్లలోకి మళ్లిస్తున్నాయన్నారు. జాతీయ ఆదా య గణాంకాల్లో కుటుంబాల మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకోవడం లేదని చెప్పారు. కుటుంబాల పొదుపు మూడేండ్లలో రూ.23.29 లక్షల కోట్ల నుంచి రూ.14.16 లక్షల కోట్లకు తగ్గినట్టు ఈ ఏడాది మే నెలలో జాతీయ గణాంకాల శాఖ వెల్లడించిన నేపథ్యంలో నాగేశ్వరన్ ఈ వ్యాఖ్య లు చేశారు.
ఫైనాన్షియల్ ఆస్తుల మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకోనందునే కటుంబాల ఆస్తులకంటే అప్పులు పెరిగాయన్న భావన ఉన్నదన్నారు. చిన్నచిన్న రు ణాలు డిఫాల్ట్ అయినంత మాత్రాన కుటుంబాలు బాధల్లో ఉన్నట్టు కాదని అన్నారు. 2020 మార్చి నుంచి ఎన్‌ఎస్‌ఈలో ఇన్వెస్టర్ల సంఖ్య దాదాపు మూడు రెట్లు పెరిగి 2024 మార్చికల్లా 9.2 కోట్లకు చేరిందని తెలిపారు. దీని ప్రకారం దేశంలోని కుటుంబాల్లో 20 శాతం వాటి పొదుపును ఫైనాన్షియల్ మార్కెట్లలోకి మళ్లిస్తున్నట్టు భావించవచ్చన్నారు. హౌసింగ్ తదితర భౌతిక ఆస్తుల్లో సైతం కుటుంబాల పెట్టుబడులు రెండేండ్లలో 10.8 శాతం నుంచి 12.9 శాతానికి పెరిగాయన్నారు.