calender_icon.png 21 January, 2025 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాగుబోతు ప్రిన్సిపాల్ మాకొద్దు

07-07-2024 02:40:50 AM

  • సూర్యాపేట జిల్లా బాలెం ఎస్సీ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థుల ఆందోళన 
  • విచారణ చేపట్టాలని మంత్రి ఉత్తమ్ ఆదేశాలు

సూర్యాపేట, జూలై 6 (విజయక్రాంతి): ‘మద్యం సేవించే ప్రిన్సిపాల్ మాకొదు’్ద అంటూ సూర్యాపేట జిల్లా బాలెంలో ఉన్న ఎస్సీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థ్ధులు శనివారం  కళాశాల ఎదుట ఆందోళన చేపట్టారు. హాస్టల్‌లో మౌలిక వసతులు లేవని, ఆహార బాగాలేదని.. మూడురోజుల క్రితం కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్తే అప్పటి నుంచి మమ్మల్ని వేధింపులకు గురిచేయడంతో పాటు ఇష్టం వచ్చినట్లు దూషిస్తోం దని గత గురువారం విద్యార్థులు కళాశాల ఎదుట ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే.

ప్రిన్సిపాల్ శైలజను సస్పెండ్ చేసి నూతన ప్రిన్సిపాల్‌ను నియమించాలని డిమాండ్ చేశారు. అయితే సదరు ప్రిన్సిపాల్  అప్పటినుంచి విధులకు హాజరుకావడంలేదు. ఈ క్రమంలో తమ ఫిర్యాదుపై అధికారులెవరూ స్పందికపోవడంతో విద్యార్థులు శనివారం మరోసారి ఆందోళనకు దిగారు.  విద్యార్థినులు మాట్లాడుతూ.. మూడు రోజులుగా తాము నిరసన తెలుపుతున్నా ఉన్నతాధికారులు స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రస్తుత ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ శైలజను తీసివేసి మరో ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ను నియమిస్తామని ఆర్‌సీఓ చెబుతున్నారని, తమకు రెగ్యులర్ ప్రిన్సిపాల్‌ను నియమించేంతవరకు ఈ నిరసన ఆగదని, హాస్టల్‌లోకి వెళ్లేదిలేదని వారు స్పష్టం చేశారు.

గురుకులంలో మహి ళా ప్రిన్సిపాల్ మద్యం సేవించి వేధిస్తుంటే అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన ఆర్డీవో, డీఎస్పీ, ఆర్‌సివోల సమక్ష్యంలో ప్రిన్సిపల్ గదిలోని బీరువాలో ఉన్న బీరు సీసాలను  విద్యార్ధిలు బయటకు తీశారు. ఇప్పటికైన అధికారులు స్పందిచాలని కోరారు. విద్యార్ధుల సమస్యలను గురుకుల సెక్రెటరీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.

విచారణకు ఆదేశించిన మంత్రి ఉత్తమ్

సూర్యాపేట జిల్లా బాలెంల ఎస్సీ మహిళా గురుకుల కళాశాల విద్యార్ధినిల ఆందోళన, కళాశాల ప్రిన్సిపల్ గదిలో బీరు సీసాలు లభ్యమైన ఘటనపై రాష్ట్ర పౌరసరఫరాల, నీటి పారుదలశాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని కలెక్టర్‌ను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు పూర్తి స్థాయి విచారణ కమిటి అధికారిగా అదనపు కలెక్టర్ బిఎస్ లత, కమిటి సభ్యులుగా డిప్యూటి సిఈవో శిరిష, సూర్యాపేట ఆర్‌డివో వేణుమాదవ్, ఎస్సీ అభివృద్ది అధికారి లతను నియమిస్తూ జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై విచారణ చేసి నివేదిక అదించాలని పెర్కొన్నారు.