ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు1 (విజయక్రాంతి): ధూల్‌పేట్‌లో గంజాయి మూలాలు లేకుండా చేయడమే ఎక్సైజ్ శాఖ లక్ష్యమని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి అన్నారు. గురువారం నాంపల్లిలోని ఎక్సైజ్ భవన్‌లో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 31 నాటికి లక్ష్యాలను చేరుకోవాలని అధికారులను ఆదేశించారు. ధూల్‌పేట్‌లో గంజాయిని నిర్మూలిస్తే హైదరాబాద్‌ను గంజాయి ఫ్రీగా మార్చొ చ్చన్నారు.
1.6 కిలోల గంజాయి పట్టివేత..
ధూల్‌పేట్‌లో గురువారం ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, పోలీసులు జరిపిన దాడుల్లో 1.6 కిలోల గంజాయి పట్టుబడింది. రితీష్‌సింగ్, పప్పుసింగ్, విష్ణుసింగ్, నిర్మల్‌సింగ్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.