calender_icon.png 3 October, 2024 | 2:39 PM

పెండ్లి వద్దని మేం చెప్పలేదు

03-10-2024 12:32:20 AM

మేం ఎవరినీ సన్యాసంలోకి మారమని చెప్పం

ఆరోపణల నేపథ్యంలో స్పందించిన ఈశా ఫౌండేషన్

చెన్నై, అక్టోబర్ 2: తన కూతురుకు పెండ్లి చేసి న ఆధ్మాత్మిక గురువు జగ్గీవాసుదేవ్ ఎందుకు ఇతరుల పిల్లలను సన్యాసినులుగా మార్చాలనుకుం టున్నార ని మద్రాస్ హై కోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో బుధవారం ఈశా ఫౌండేషన్ స్పందించింది. తాము ఎవరిని పెండ్లి చేసుకోవాలని కానీ, సన్యాసంలో చేరాలని గానీ ఒత్తిడి చేయమని స్పష్టం చేసింది.

‘ప్రజలకు యోగా, ఆధ్యాత్మికతను అందించేందుకు సద్గురు.. ఈశా ఫౌండేషన్ స్థాపించారు. వ్యక్తులకు ఆయా మార్గాలను ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుందని నమ్ముతున్నాం. పెళ్లి గురిం చి, సన్యాసం స్వీకరించాలని గానీ మేం ఎవరినీ అడగం. ఇవన్నీ వారి వ్యక్తిగత విషయాలు. బ్రహ్మచర్యం తీసుకున్నది కొద్దిమంది మాత్రమే.

అయినా ఈ కేసులో పిటిషనర్ సన్యాసులను కోర్టు ముందు హాజరు పరచాలని కోరారు. వారు కోర్టుకు హాజరై ఇష్టంగానే ఇక్కడ ఉంటున్నామని చెప్పారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. సత్యం గెలుస్తుందని భావిస్తున్నాం. అనసవరమైన వివాదాలకు ముగింపు లభిస్తుంది’ అని ఈశా ఫౌండేషన్ పేర్కొంది.

కోయంబత్తూరులో ఈశా యోగా కేంద్రంలో ఉంటున్న తన ఇద్దరు కుమార్తెలను అప్పగించాలని విశ్రాంత ప్రొఫెసర్ కామరాజ్ హైకోర్టులో హెబియస్ కార్పస్ దాఖలు చేశారు. తన కుమార్తెలు గీత, లత యోగా నేర్చుకునేందుకు వెళ్లి అక్కడే ఉండిపోయారన్నారు.

దీనిపై ఇదివరకే విచారణ జరిపిన హైకోర్టు.. కోయంబత్తూరు జడ్జి పరిశీలించిన నివేదిక దాఖలు చేయాలని ఆదేశించిది. ఆ తర్వాత తమ ఇబ్బందికి గురిచేయకూడదని కుమార్తెలు సివిల్ కేసు వేశారని, దీంతో వేశారని, తన భార్య మానసికంగా ప్రభావితమైనట్లు పిటిషనర్ తెలిపారు.