calender_icon.png 15 November, 2024 | 8:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేం అధికారులపై దాడి చేయలేదు..

15-11-2024 01:04:18 AM

  1. తప్పుడు కేసులు ఎత్తివేయాలి
  2. అక్రమ అరెస్ట్‌లను నిలిపివేయాలి
  3. లగచర్ల గ్రామస్తుల డిమాండ్

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబరు 14 (విజయక్రాంతి): తనపై దాడి జరగలేదని సాక్షాత్తు కలెక్టర్ ప్రతీక్ జైన్ చెప్తున్నారని, అయినప్పటికీ పోలీసులు తమ భర్తలపై కేసులు నమోదు చేసి, భయభ్రాంతులకు గురిచేయడం సరికాదని వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లకు చెందిన పలువురు మహిళలు అన్నారు.

హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఫార్మా సిటీ తమ ప్రాంతంలో పెట్టొద్దని కోరుతున్నామన్నారు. ఫార్మా కోసం భూములు ఇవ్వడం తమకు ఇష్టం లేదన్నారు. తాము భూమిని నమ్ముకుని జీవిస్తున్నామని, ఆ భూములు లాక్కుంటే తామెలా బతగలమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

సోమవారం అర్ధరాత్రి పోలీసులు తమ గ్రామానికి వచ్చారని, ఇళ్లలోకి చొరబడి కండ్ల ముందే తమ భర్తలను తీసుకెళ్లారన్నారు. అడ్డుకున్న మహిళలను లెక్కచేయలేదన్నారు. తొమ్మిది నెలల గర్భిణి ఛాతిని తొక్కుకుంటూ వెళ్లారన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా గ్రామస్తుల పై మోపిన తప్పుడు కేసులను ఉప సంహరించుకోవాలని, అక్రమ అరెస్టులను వెంట నే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.