సిరిసిల్ల (విజయక్రాంతి): తాము అధికారంలోకి వచ్చి పది నెలల్లోనే పదవి దిగిపోవాల్నా.. వారి పదేండ్ల పాలనలో చేపట్టని అభివృద్ధిని పది నెలల్లోనే చేసి చూపించాం అని సీఎం రేవంత్ అన్నారు. బుధవారం వేములవాడ రాజన్నను దర్శించుకున్న తర్వాత జరిగిన సభలో ఉద్వేగంగా ప్రసంగించారు. రైతులకు రుణమాఫీ చేశామని కేసీఆర్ సభకు వస్తే లెక్కలు అప్పజెప్తామని అన్నారు. నిజాలను ఎదుర్కొనే ధైర్యం కేసీఆర్‌కు లేదని విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోయినా బీఆర్ఎస్‌కు బుద్ధి రాలేదని మండిపడ్డారు. రుణమాఫీ లెక్కలు అసెంబ్లీలో తేల్చుకుందాం దమ్ముంటే కేసిఆర్ అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. కేసిఆర్ ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదని, తెలంగాణలో ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ కట్టబోయేది కాంగ్రెస్ అన్నారు. బండి సంజయ్ ని రెండు సార్లు గెలిపించి కేంద్రమంత్రిని చేసారని బండి చేసింది ఏమి లేదన్నారు.