15-04-2025 01:38:55 AM
మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.
వనపర్తి టౌన్ ఏప్రిల్ 14: చారిత్రాత్మక రజతోత్సవ సభకు రావడం మన బాధ్యత అని రజతోత్సవ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.27న వరంగల్ నందు జరగబోవు రజతోత్సవ సన్నాహక సమావేశం(పట్టణ,మండల)ఈరోజు నిరంజన్ రెడ్డి స్వగృహంలో జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ. డాక్టర్.బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించారు.
డాక్టర్.బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ఆర్టికల్3 వలన తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అని చిన్న రాష్ట్రల ఏర్పాటు వల్ల అభివృద్ధి సాధ్యం అని ఆనాడు అంబేద్కర్ ప్రతిపాదించడం కారణం అని అన్నారు.వార్డుల నుండి గ్రామాలనుండి ఒక ప్రభంజనంలాగా,పండుగలా తరలిరావాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు విసిగి ఉన్నారని వారికి అండగా నిలవడం నాయకుల బాధ్యత అని అన్నారు.పెద్ద ఎత్తున సన్నాహక సమావేశాలకు అన్ని మండలాలో అనూహ్య స్పందన లభించిందని ఈ ఉత్సాహం స్థానిక సంస్థల ఎన్నికల వరకు కొనసాగించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్,పి.రమేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.