calender_icon.png 31 March, 2025 | 5:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా రోడ్డు మాకే దక్కాలి..!

24-03-2025 12:00:00 AM

రామాయంపేట, మార్చి 23: కాలనీకి మంజూరైన బీటీ రోడ్డు మాకే దక్కాలని.. ఎవరు అడ్డం వచ్చినా ఊరుకునేది లేదని రామాయంపేట పట్టణంలోని కేసీఆర్ కాలనీవాసులు కమాన్ వద్ద నిరసన సంతకాల సేకరణ చేపట్టారు. ఆదివారం కాలనీకి చెంది న సంఘ సభ్యులు అందరూ దాదాపు 200 మంది కాలనీవాసులతో సంతకాల సేకరణ చేపట్టారు.  అనంతరం కేసీఆర్ కాలనీకి వచ్చే బీటీ రోడ్డు పనులను అడ్డుకున్నారు.

మాకు డ్రైనేజీలు కట్టే వరకు మేము రోడ్డు నిర్మాణం చేపట్టేది లేదని అనడంతో కాలనీవాసులకు, మూడో వార్డు ప్రజలకు తీవ్ర వాగ్వాదం  జరిగింది. తాము ఎమ్మెల్యే ద్వారా రోడ్డు మంజూరు చేయించుకున్నామని, ఈ రోడ్డును మా కాలనీకి తీసుకెళ్తామని మొండికేశారు.

దీంతో విషయం తెలుసుకున్న రా మాయంపేట ఎస్త్స్ర బాలరాజు, పీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు, మాజీ ఎంపీపీ రమేష్ రెడ్డి, అల్లాడి వెంకటేష్ లు అక్కడికి చేరుకుని ఇరువురిని సముదాయించి ఇక్కడ డ్రైనేజీకీ కూడా నిధులను మంజూరు చేయించేలా కృషి చేస్తానని సుప్రభాతరావు హామీనివ్వడంతో గొడవ సద్దుమణిగింది.